బెండకాయలు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పై ఫొటోలో లాగ మధ్యకు చీరి, సన్నగా పొడుగ్గా ఉండేలా తరిగి కూర చేస్తే తినడానికీ, చూడటానికీ కూడా వెరైటీగా ఉంటుంది :)
శనగపప్పు కారం ఎలా చెయ్యాలో క్రింద రెసిపీలో రాసాను. అక్కడ ఓసారి చూసి వచ్చేయండి..:)
* ఈ శనగపప్పు కారం బీరకాయ, దొండకాయ, వంకాయ, కాకరకాయ మొదలైన కూరల్లో వేసుకోవచ్చు.
* శనగపప్పు తినకూడనివాళ్ళు, పడనివాళ్ళూ అది లేకుండా మిగతా ఐటెంస్ తో పొడి గ్రైండ్ చేసుకోవచ్చు. కాస్త మినపప్పే ఎక్కువ వేసుకుంటే సరి.
తయారీ:
* మూకుడులో రెండు చెంచాలనూనె వేసి, మధ్యకు చీరి సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసి, కాస్త వేగాకా క్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు కారం, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి, మూతలో అర గ్లాసుడు నీళ్ళు పోయాలి. నాన్స్టిక్ పేన్ అయితే పైన క్లోజ్డ్ లిడ్ ఉంటుంది కదా అది పెట్టేస్తే సరిపోతుంది.
* కూర అయ్యేదాకా స్టౌ సిమ్ లోనే పెట్టాలి. అప్పుడే బాగా వేగుతుంది కూర.
* ఐదు పదినిమిషాల తర్వాత ముక్కలు మెత్త బడ్డాయి అనిపించాకా మూత తీసేసి, మధ్య మధ్య కలుపుతూ ఓపెన్ గా వేయించాలి కూర. అప్పుడు బెండకాయలు జిగురువల్ల ముద్దగా అయిపోకుండా పొడిపొడిగా వస్తుంది కూర.
టిప్:
ఈ కూరలో సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. శనగపప్పు కారం వేసేప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయచ్చు.
బావుందండి ..ప్రియా వుంటుందిగా ఆవిడ మీద ఓ ట్రైల్ వెయ్యాలి Radhika (nani)
@radhika: ఊ..ట్రై చెయ్యండి..:)