టూ మినిట్స్ మ్యాగీ కన్నా సులువు ఈ పచ్చడి చెయ్యడం. కరెంట్ లేదు.. మిక్సీ లేకుండా పచ్చడి ఎలా చెయ్యడం అన్న దిగులు ఉండదు. మిక్సీలో తిప్పాల్సిన అవసరం లేని ఈజీ అండ్ సింపుల్ పచ్చడి ఇది!
ఎలాగంటే:
* ముందు ఓ చిన్న చెంచా నూనెలో ఆవాలు,మినపప్పు,జీలకర్ర,ఇంగువ పోపు పెట్టుకోవాలి. పోపు వేగాకా కట్టేసే ముందు అర చెంచా కారం వేసి బాగాకలిపి స్టౌ ఆపేయాలి. (కారం ఇష్టం లేకపోతే ఒక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పోపులో వేయించాలి. కానీ ఇవి మళ్ళీ తొక్కుకోవాలి. సో,కారమే బెటర్)
* పోపు చిన్న గిన్నెలోకి తీసేసుకుని, మూకుడులో మళ్ళీ ఓ చెంచా నూనె వేసిన తర్వాత, కడిగి,తరిగి ఉంచిన రెండు కట్టలు చుక్కాకు వేసి, అర చెంచా ఉప్పు వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి.
* చుక్కాకు సుగుణం ఏంటంటే ఇట్టే పేట్ లా అయిపోతుంది. పచ్చడికి గ్రైండర్లో వేయక్కర్లేదు. అందుకే పోపులో కారం వేయమన్నా.
ఆకు కడిగిన తడి చాలు మళ్ళీ నీళ్ళు కూడా చల్లక్కర్లేదు. జస్ట్ బాగా కలుపుతూ ఉండాలి వెగేదాకా. లేకపోతే అడుగంటిపోతుంది ఆకు.
* ఈ ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు.
* ఆకు బాగా దగ్గరపడి ముద్దలా అయిపోయాకా ఆపేసి, అందులో పోపు కలుపుకుని తినెయ్యడమే.
* అన్నం లోకీ దోశల్లోకీ కూడా బావుంటుందీ పచ్చడి.
టిప్:
* కావాలనుకుంటే ఆకు వేగేప్పుడు ఓ చిటికెడు ఆమ్చూర్ పౌడర్(డ్రై మ్యాంగో పౌడర్) వేస్తే కూడా బావుంటుంది.
చుక్కాకు అన్నా చుక్కకూర అన్నా ఒకటేనాండీ? and please let us know how to identify this leaf.
@అనిర్విన్ :మీరు ఇండియాలో ఉండి ఉంటే్ ఆకుకూరలు అమ్మే ప్రతి చోటా చుక్క కూర దొరుకుతుందండీ. పైన పచ్చడి పక్కన ఆకులు పెట్టాను చూడండి.అవే చుక్కకూర ఆకులు. కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. పెళుసుగా ఉండి, విరిస్తే విరిగిపోతాయి ఆకులు. ఆకు రుచి గోంగూర లాగ చాలా పుల్లన. పప్పు బాగుంటుంది. విత్తనాల షాపుల్లో విత్తనాలు కొనుక్కుని కుండీలో కూడా పెంచుకోవచ్చు ఈ ఆకు. క్రింద బ్లాగ్ పోస్ట్ లో మొదటి ఫోటోలో ఉంది చూడండి.
http://trishnaventa.blogspot.in/2010/12/blog-post_24.html
బాగా పెరిగాకా క్రింద బ్లాగ్ పోస్ట్ లో ఫోటోలోలాగ పువ్వులు వస్తాయి. వాటిని ఎండిస్తే మళ్ళీ విత్తనాలు అవుతాయి..:)
http://trishnaventa.blogspot.in/2011/03/blog-post_05.html
>>మీరు ఇండియాలో ఉండి ఉంటే్ ఆకుకూరలు అమ్మే ప్రతి చోటా చుక్క కూర దొరుకుతుందండీ.
nope.. you dont find it in bangalore :((
and i never ate it in north india as well.. Andhralo maatrame ekkuvagaa dorukutundi anukuntaa..
and yes, చుక్కాకు పప్పు కింగ్ ఆఫ్ పప్పు.. :))
@karthik: అవునా? surprising! పాలకూర లాగ అన్నిచోట్లా దొరుకుతుందనుకుంటున్నానండి..కానీ కుండీలో విత్తనాలు వేస్తే ఏ ప్రాంతంలోనైనా పండుతుంది :)