బజార్లో ఇప్పుడు రకరకాల కంపెనీల వారు 1+1ఆఫర్లతో రకరకాల సూప్స్ అమ్ముతున్నారు. చలి కాలం భోజనం తయారయ్యేలోపూ లేదా సాయంత్రాలు వెచ్చవెచ్చగా సూప్ తాగితే బావుంటుంది. కానీ బజార్లో దొరికేవాటిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు. అవి ఎక్కువగా తినడం మంచిది కాదు. సో, ఇంట్లో మనం స్వయంగా చేసుకున్న సూప్ అయితే అన్నివిధాలా ఆరోగ్యకరం. క్రింద రాసిన పధ్దతిలో టమాటా ఇంకా కార్న్, స్వీట్ కార్న్, మిక్స్డ్ వెజిటబుల్ సూప్స్ చేసుకోవచ్చు.
టమటా సూప్ తయారీ:
* పావు కేజీ టమాటాలు బాగా కడిగి, నాలుగు ముక్కలుగా తరగాలి.
* ఒక మీడియం చెంచా నెయ్యి లేదా బటర్ లో రెండు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, ఒక వెల్లుల్లిపాయ వేసి వేగాకా, టమాటా ముక్కలు, ఒక మీడియం కేరెట్(స్వీట్నెస్ కోసం), చిన్న బీట్రూట్ ముక్క(ఇది ఎరుపు రంగు కోసం. కలపకపోయినా పర్లేదు.) కూడా వేసి కాస్త వేయించి, ఒక గ్లాసుడు నీళ్ళు పోసి 5mins మగ్గనివ్వాలి. చిన్న కుక్కర్ లో ప్రెషర్ కుక్ చేసినా సరే. కుక్కర్లో అయితే అయితే అర గ్లాస్ నీళ్ళు చాలు. ఒక్క విజిల్ రాగానే స్టౌ ఆపేయచ్చు.
* ఇప్పుడు టమాటా ముక్కల్లోంచి లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ ముక్కలు ఏరి, తీసేయాలి. టమాటాలకి వాటి ఫ్లేవర్ అంటితే చాలు.
* ఇప్పుడు ఉడికిన ముక్కల్ని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి, ఆ గుజ్జుని స్ట్రైనర్ లో వేసి వడబోసేయాలి.
* వచ్చిన గుజ్జుకి డబల్ ఎమౌంట్ నీళ్ళు కలిపి, తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి.
* ఐదు నిమిషాల్లో మిశ్రమమంతా మరుగుకి వస్తుంది. అప్పుడు ఒక రెండు చెంచాలు కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి) విడిగా అరగ్లాసు నీళ్ళల్లో కలిపి, మరుగుతున్న టమాటా గుజ్జు నీళ్ళల్లో కలపాలి. ఇది సూప్ ని స్టిక్కీగా చేసి, దగ్గర చేస్తుంది.
* ఇంకా తీపి కావాలంటే ఒక చెంచా పంచదార కలుపుకోవచ్చు.
* మరుగుతున్న soupలో అర స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి.
* మరుగుతున్న soupలో అర స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి.
* సర్వ్ చేసే ముందు తరిగిన కొత్తిమీర, rusk ముక్కలు వేసి ఇస్తే రుచిగా సూప్ ఉంటుంది.
(ఇందులో కేరెట్/బీట్రూట్ ఏమీ కలపలేదు. ప్లైన్ టమాటా సూప్) |
టిప్:
బ్రెడ్ ముక్కలు వేయించి కలపచ్చు కానీ అది మళ్ళీ మరో పని + బ్రెడ్ త్వరగా మెత్తపడిపోతుంది. కాబట్టీ బజార్లో దొరికే milk rusks or plain suzi rusks కొనుక్కుంటే సూప్స్ లోకి బావుంటాయి. త్వరగా ముద్దయిపోకుండా ఉంటాయి. ఏలక్కాయ ఫ్లేవర్(Ilaichi flavour) ఉన్న రస్కులు వస్తాయి. అవి మాత్రం సూప్ లోకి బావుండవు. కొనేప్పుడు ఫ్లేవర్ చూసుకుని కొనండి.
చలిబాగా పెరిగింది. మంచిగా మీరుచూపించిన సూప్, వెరీ నైస్ కాంబినేషన్.థాంక్యూవెరీమచ్.
@swarajya lakshmi mallampalli: Thanks for the visit.
బాగా వచ్చింది. మేము గార్లిక్ బదులు ఆనియన్స్ వేశాము. థాంక్స్ ఫర్ ది రెసిపీ.