నిన్న రాత్రి మొదటిసారి చేసిన ఈ ప్రయోగానికి ఏం పేరు పేట్టాలో అని ఆలోచిస్తే.. 'జొన్న మొలకల ఉప్మా' అనచ్చేమో అనిపించింది.
జొన్నలని(Jowar) ఒకపూటంతా(6,7hrs) నానబెట్టి, నీళ్ళు తీసేసి, రాత్రికి పల్చటి కాటన్ బట్టలో మూట కట్టచ్చు.. లేదా బాగా డ్రైగా చేసేసి ఏదైనా గిన్నె/బాక్స్ లో వేసి మూత పెడితే పొద్దుటికి మొలకలు వచ్చేస్తాయి. పెసలైనా, బొబ్బర్లైనా మొలకెత్తించడానికి ఇదే పధ్ధతి. ఒకవేళ రాత్రికి నానబెడితే పొద్దున్నే డ్రైగా మూట కట్టేస్తే సాయంత్రానికి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. మరనాటిదాకా ఉంచితే ఇంకా ఎక్కువ మొలకలు వస్తాయి.
ఇదివరకూ సజ్జలు(Bajra), రాగులు(ragi) మొలకెత్తించి వాడాను కానీ జొన్నలు ఇదే మొలకెత్తించడం. ఏదో ఒక టిఫిన్ + రాగి మజ్జిగ నా రాత్రి భోజనం మెనూ. ఇడ్లీ, దోశలాంటి రొటీన్ టిఫిన్స్ వరుస అయిపోయాకా, రకరకాల కొత్త టిఫిన్ ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను. జొన్నలతో సరదాగా కొత్త రకం ఏదైనా చెద్దామని మనసై మొన్న రాత్రి జొన్నలు నానబెట్టాను. నిన్న పొద్దున్నే నీళ్ళు తీసేసి ఓ గిన్నెలో వేసి మూతపెట్టాను. రాత్రికి మొలకలు వచ్చాయి.
జొన్న మొలకల ఉప్మా తయారీ:
* ముందర జొన్నలు కుక్కర్లో ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. (జొన్నన్నం ఇలానే వండుతారేమో!) వీటితో సంతోషకరమైనదేమిటంటే ఎక్కువ విజిల్స్ వచ్చినా పేస్ట్ అవ్వవు ఇవి :) సుమారు 100gms జొన్నలకి 300ml నీళ్ళు + తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్ ఓపెన్ చేసాకా జొన్నలతో పాటూ మిగిలి ఉన్న నీళ్ళు పారబొయ్యకుండా ఉంచాలి.
* ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తరిగి, ఉప్మా కి లానే మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, మిర్చి, కర్వేపాకు పోపు వేయించి, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
*ఎదురుగా అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన fresh green peas కనిపిస్తే అవి ఓ నాలుగు వలిచి ఉల్లిపాయ ముక్కల్లో పడేసా. ఓ కేరెట్ కూడా తరిగి వేసా.(కేరెట్ గ్రేట్ చేసేసుకోవచ్చు.వేయించకపోయినా పర్వాలేదు)
* ఇప్పుడూ ఉడికిన జొన్న మొలకలను ఈ ఉల్లిపాయముక్కల పోపులో పడేయాలి, నీళ్ళతో సహా. ఉప్పు చెక్ చేసి కావాలిస్తే కలిపి, చిటికెడు పసుపు వెయ్యాలి. కాసేపటికి నీళ్ళు ఇగిరిపోతాయి.
* ఉప్మా దగ్గర పడ్డాకా దింపేసుకుని నాలుగు కొత్తిమీర ఆకులు అలంకరించి, ఒక అరచెక్క నిమ్మరసం పిండేసి తినేయడమే..!
ఈ రెసిపీ కాస్త పళ్ళకి పెద్ద పనే కానీ టేస్టీగా ఉంది.
ఇవాళ పొద్దున్నకి నేను బానే ఉన్నా కాబట్టీ.. కొత్తరకాలు ఇష్టపడేవారు ట్రై చేయచ్చు..:)
టిప్:
ఉప్మాలోకి ఉల్లిపాయలతో పాటూ టమాటా ముక్కలు వాడితే నిమ్మరసం అక్కర్లేదేమో! నే టమాటా వాడలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా.
నోరూరించేస్తోందండోయ్ !!
ఏ ఫార్ములా అయినా జెప్పిన మిగిలిన ఐటెం తో తో బాటు చేసేయ్య గలరనుకుంటా మీరు ఉప్మా క్రింద !
కార్న్ ఉప్మా చేసి చూడండీ ! ఇది కూడా చాలా బాగా ఉంటుంది (మీ జోవర్ పధ్ధతి లో నే )
రెండు కార్న్ తో పప్పు కూరా చేసి చూడొచ్చు అదీ బాగా నే ఉంటుంది (మిగిలిన్న తరీకా అన్నీ మీ రు చెప్పినట్టే )
జిలేబి
@Zilebi: 'కార్న్ రవ్వ' దొరుకుతుంది కదా దానితో చేస్తానండి ఉప్మా. కార్న్,స్వీట్ కార్న్ రెండూ సూప్స్ చేయడానికీ లేదా జస్ట్ సలాడ్ లాగ తినడానికి ఉడికిస్తాను. ఇంకా ఉడికిన గింజలనే కొన్ని కూరల్లో గ్రీన్ పీస్ వేసినట్లు వేసేస్తూ ఉంటాను. మీరు చెప్పిన ఐడియా కూడా బానే ఉందండి ట్రై చేస్తాను.Thank you :)