|
చలికాలం అయిపోతోంది కానీ ఇంకా లేత ముల్లంగి దొరుకుతోంది. ముల్లంగి వాసన నచ్చక కూరగా కానీ పచ్చడిగా కానీ తినలేనివారు ముల్లంగి తురుముకుని చపాతీ చేసుకోవచ్చు.
ముల్లంగి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో క్రింద లింక్ లో చూడవచ్చు:
http://en.petitchef.com/recipes/health-benefits-of-mooliradish-fid-418423
తయారీ:
* ముందుగా లేత ముల్లంగి ఇలా తురుముకోవాలి.
* ముల్లంగి వాసన నచ్చకపోతే, ఆ తురుములో కాస్తంత ఉప్పు వేసి ఐదు నిమిషాలు అట్టే పెట్టి, ఆతర్వాత ముల్లంగి తురుముని గట్టిగా పిండేసి, గోధుమపిండిలో కలపాలి.
* రెండు గ్లాసుల గోధుమపిండికి, ఒకటిన్నర గ్లాసుల ముల్లంగి తురుము వేసి చపాతీ పిండి కలుపుకోవాలి. ఇలా..
* కలుపుకున్న పిండిని వీలయినంత త్వరగా వత్తేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచితే ముల్లంగిలో ఉన్న తేమ వల్ల పిండి బాగా మెత్తగా అయిపోతుంది.
* వీలయినంత సన్నగా చపాతీ వత్తుకుని, పెనం మీద చపాతీ చూట్టు పావు చెంచా నూనె వేసి మీద చపాతీ కాల్చుకోవాలి.
* రుచికరమైన ముల్లంగి చపాతీలు ఏదైనా ఆకుకూరపప్పుతో కానీ, ఏదైనా కూరతో కానీ తినవచ్చు.


