ఇది నా ఇవాళ్టి పొద్దుటి తిఫిన్. ఆదివారం పొద్దున్నే ఓట్స్ ఉప్మా తినే మొహం నువ్వూనూ అని
నవ్వుకుంటున్నారా..? నాకేం బాధలేదు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను హాయిగా తినేస్తాను. అందులోనూ ఉప్మాలో మొలకెత్తిన పెసలు,కేరట్ తురుము, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమెరప, కొత్తిమీర, కర్వేపాకు అన్నీ వేసాకా తినటానికేం? ఉప్మాలందు ఓట్స్ ఉప్మా మేలయా అంటారు డైటిషియన్స్, న్యూట్రీషనిస్ట్ లు కూడా. వీటిలోని పోషకాలను గురించి తెలిసాకా ఓట్స్ ను ఏదో రూపంలో వంటల్లో వాడటం మొదలెట్టాను నేను.
అబ్బే నేను ఓట్స్ ఉప్మా ఎలా చేయాలో చెప్పబోవటం లేదు.. జస్ట్ ఓట్స్ లోని పోషకాలను ఉపయోగాలను గురించి చెప్తానంటే.
ఓట్స్ రోజూ తింటే ఏమౌతుందంటే :
* ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి అరుగుదలను తేలిక చేస్తాయి.
* కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
* బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
* రోజూ ఓట్స్ తింటే హై బ్లడ్ ప్రషర్ తగ్గుతుంది.
* ఓట్స్ లోని సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ మలబధ్ధకాన్ని తగ్గిస్తుంది.
* అధిక బరువుని తగ్గిస్తుంది.
* ఓట్స్ లో ఫొలిక్ ఏసిడ్, విటమిన్ ఈ, బయోటిన్, కాపర్, ఐరన్ మొదలైన ఉపయొగకరమైన విటమిన్లు ఉంటాయి.
*వీటిలో ఉండే "ఫైటోకెమికల్స్" కేన్సర్ వంటి జబ్బుల బారిన పడకుండా రక్షణ నిస్తాయి.
ఓట్స్ ఎలా తినచ్చు:
* వేడి పాలలో వేసుకుని కాసేపు నానాకా తినచ్చు.
* కాసిని ఓట్స్ తో సూప్ చేసుకుని తినొచ్చు.
* పైన ఫోటోలోలాగ ఉప్మా చేసుకుని తినచ్చు.
* ఓ గుప్పెడు ఓట్స్ చపాతీ కలిపేప్పుడు పిండిలో కలిపేస్తూ ఉండచ్చు.
* కాసిని ఓట్స్ గ్రైండ్ చేసేసి ఆ పొడిని దోశల పిండిలో కలిపేయచ్చు.
ఇంట్లో అందరితోనూ ఓట్స్ తినిపించాలంటే పైన రాసినవాటిలో చివరి రెండు పాటించచ్చు. కాకపోతే అలా కలిపినట్లు చెప్పకూడదన్నమాట...:)
దయ చేసి వండేవిధానం చెప్పండి. థాంక్స్.
@అనిర్విన్: మమూలు ఉప్మా లాగానేనండి. కాకపోతే ముందుగా ఓట్స్ ను నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి. తరువాత మామూలుగా ఉప్మాలానే పోపు వేసుకుని,
అల్లం,మిర్చి, కర్వేపాకు,కావాల్సిన కూర ముక్కలు అంటే కేరెట్, ఉల్లిపాయ బీన్స్ మొదలైనవి వేసుకుని
(ఒక కప్పు ఓట్స్ కి) రెండు కప్పుల నీళ్ళు పోసుకుని,
సాల్ట్ వేసి,
నీళ్ళు మరుగుతూండగా ఓట్స్ వేసేసి
దగ్గర పడేదాకా మధ్య మధ్య కలుపుతూ,
దగ్గర పడ్డాకా దింపేసుకోవటమే .
కూరలు ఇవే వేసుకోవాలి అని రూలేం లేదండి.
బఠాణీ, కేబేజ్, మొలకెత్తిన శెనగలు, పెసలు మొదలైనవేమైనా వేసుకోవచ్చు.
చేసుకున్నాకా ఎలా వచ్చిందో చెప్పాలి మరి..:)
@అనిర్విన్: ముందుగా ఓట్స్ ను పొడిగా ఎందుకు వేయించుకోవాలి అని అడగకండీ..నాకు తెలీదు. ఓట్స్ పేకెట్ మీద అలా చెయ్యమని ఉంది మరి !!
అలా చెయ్యక పోతే, ఓట్స్‌కి సహజమైన గుణం నీళ్ళు తగలంగానే జిగురుజిగురుగా అవుతుంది.
ఉప్మా గా చేసుకొనే గోధుమ రవ్వ, సేమ్యాలు కూడా ముందు వేయించుకుంటాంగా. అలా అయితే ఉప్మా మరీ పేస్ట్ లాగ, ముద్దగా అవదని చెప్తారు.
బహుశ ఓట్స్ కూడా అందుకే ఓసారి వేయించాలేమో అనుకుంటా.
@కొత్తపాళీ: ఓహో..ఇదన్నమాట సంగతి...థాంక్స్ అండీ.
@సుధ: పైన కొత్తపాళీగారు కూడా రీజన్ చెప్పారండి. ఉప్మాకి గోధుమరవ్వ, బొంబాయి రవ్వ కూడా నేను వేయించనండి. గోధుమరవ్వ అయితే డైరెక్ట్ గా పోపు + అన్ని కూరముక్కలు వేసేసి బుల్లి కుక్కర్లో పెట్టేస్తా. సేమ్యా మాత్రం "రోస్టేడ్ సేమ్యా" కొనేస్తాను పరమాన్నం చేసినా బాగుంటుందని. అందుకని వేయించే ప్రశ్న మిగిలిన ఉప్మాల్లో రాలేదు నాకు...:)
ధన్యవాదాలు.
ఓట్స్ కాని, రవ్వ కాని, సేమ్యా కాని ఉప్మా చేసేముందు కొద్దిగా వేయించాలి. దానివల్ల వాటికి పచ్చివాసన పోయి మంచిరుచి వస్తుంధి. అలాగే ముద్దలా కాకుండా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి..తేడా తెలుస్తుంది.. దీనికోసం నెయ్యి వేసినా వేయకున్నా పర్లేదు.
ఈ రోజు చేసానండి, బాగా వచ్చింది. జీడిపప్పు, french బీన్స్ వేసానండి, నాదగ్గర అవే ఉన్నాయి రెడీగా. Thanks for your recipe.
మామూలుగా అయితే రవ్వ వేయించే అలవాటు నాకు లేదు. శ్రమ పడలేక. పైగా నాకు ఈ రుచే నచ్చుతుంది.
@అనిర్విన్ :Thank you too.
MEERU CHEPPINA UPMA VIDHANAM CHALA BHAGUNDHI, REPATINUNCHI NENU TRY CHESTHANU
@kothaga: thanks for the visit.