హీరోయిన్ కుటుంబం ఆచూకీ తెలియక వెతికి వెతికి అలసిపోయి..అన్యమనస్కంగా ఓ హోటల్లో కూర్చున్న హీరోకి "వేడి వేడి అరటిపువ్వు వడలు ఒకావిడ వేస్తోంది తినండి" అని ఒక ప్లేట్ ఇస్తాడు వెయిటర్. హీరో బుర్రలో బల్బ్ వెలుగుతుంది. వడివడిగా హోటల్ కిచెల్ లోకి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ తల్లి వడలు వేస్తూ కనబడుతుంది. కట్ చేస్తే...
సినిమా అవ్వగానే వడలు చేయటానికి "అరటిపువ్వు" ఎక్కడ దొరుకుతుందా అని చూసింది తృష్ణ...అంటే నేనేనన్నమాట..!
ఇంతకీ సినిమా గుర్తు వచ్చేసిందా? మోస్ట్ ఎంటర్టైనింగ్ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ "ప్రియురాలు పిలిచింది". (ఆంగ్ల రొమాంటిక్ ఫిక్షన్ రచయిత్రి "జేన్ ఆస్టిన్" రాసిన "సెన్స్ అండ్ సెన్సిబిలిటీ" నవల ఈ సినిమాకు ఆధారం) I love the film and also the most tempting అరటిపువ్వు వడలు.
Now coming to vadas..firstly we have to buy a banana flower ..:) (అబ్బా మాకు తెలీదులే అంటున్నారు కదా..వినిపిస్తోంది నాకు...:)
కొన్న అరటిపువ్వు
అరటిపువ్వుతో
౧)ఆవ పెట్టి కూర
౨)పెసరపప్పు బద్దలతో పొడికూర
౩)పచ్చడి
౪)వడలు
ఈ నాలుగూ మా ఇంట్లో చేస్తూంటాం. నాకు పచ్చడి, వడలు ఇష్టం. ప్రస్తుతం వడల వరకూ చెప్పుకుందాం.
అరటిపువ్వును వంటకు వాడాలంటే కొంచెం శ్రమ,ఓపిక అవసరం. చేతికి కాస్త నూనె రాసుకుని(లేకపోతే నల్లగా అయిపోతాయి) ఆ పువ్వులో చివర ఉన్నవి వలుచుకోవాలి. క్రింది ఫోటోలో లాగఉన్నవన్నమాట.
ఆ తరువాత వాటిల్లోంచి క్రింద ఫోటోలో చూపించినవి తొలగించవలెను. లేకపోతే చేదు,వగరు కలగలిపి ఒక వింత టేస్టు వస్తుంది. అది మనం భరించలేము.
*ఆ తర్వాత వాటిని రోటిలో కానీ గ్రైండర్ లో కానీ కాస్త ఉప్పు వేసి కాస్తంత తొక్కవలేను.
* ఆ తొక్కిన పదార్ధాన్ని గట్టిగా పిండవలెను.
*అప్పుడొక ముద్ద రెడీ అవుతుంది. అదే మనకు కావాల్సిన పదార్ధం.
*వడలు చేసే హడావుడిలో ఇక ఆ ముద్దకు ఫోటో తియ్యలేదు..:(
ఇప్పుడు వడలు చేసే విధానం:
*అరగంట ముందుగా ఒక మీడియం కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి.
*పువ్వు వలిచి తొక్కుకునేలోపూ ఆ టైమే అవుతుంది. పైన చెప్పినట్టుగా తొక్కిన అరటిపువ్వు ముద్దను పక్కన(ఏ పక్కన తల్లీ అని ఆడగకండి) పెట్టుకోవాలి.
*నానబెట్టిన శనగపప్పు, జోలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు, అల్లం ముక్క అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
* ఈ మిశ్రమానికి తరిగిన తరిగిన ఉల్లిపాయ(1) ముక్కలు కలపాలి.
* ఆ రుబ్బిన ముద్దలో అరటిపువ్వు ముద్దను కలపాలి. క్రింద ఫోటోలోలాగ ఉంటుంది మిశ్రమం.
*అప్పుడు కడాయి లో నూనె వేడి చేసుకుని వడలు వేయించేసుకోవటమే. అవి పైన పెట్టిన ఫోటోలో ఉన్నాయి కదా. ఫోటోలో పుదీనా ఆకులు జస్ట్ colourful గా ఉంటాయని పెట్టాను. వాటికీ వడలకీ లింకేమీ లేదు. ఇక చేసుకున్న వడలను పక్కనెవరన్నా ఉంటే పెట్టడం.. లేదంటే మనమే అన్నీ సుబ్బరంగా తినేయాలన్న మాట. అలా చూడకండి దిష్టి తగులుతుంది. నాక్కాదు నా వడలకి..:)
అరటిపువ్వులో vitamin E పుష్కలంగా ఉంటుంది. చాలా మంచిది. మిగిలిన
ఉపయోగాల కోసం ఇక్కడ చూడండి.
మీ ఓపిక్కి మరియు కొత్త వంటలు తయారు చెయ్యాలనే ఉత్సాహానికి Hats off ..అరటి పువ్వులు హైద్రాబాదులో ఎక్కడ దొరుకుతాయో కాస్త చెప్తారా?..ఆ బొమ్మ చూస్తుంటే నోరూరి పోతుంది..మంచి రెసీప్ చెప్పారు..ధన్యవాదాలు..
@నైమిష్: హైదరాబాద్ లో నాకు తెలిసీ అరటిపువ్వు దొరికే చోట్లు:
* చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి సందు మొదట్లో
* పద్మారవు నగర్ స్కందగిరి (సుబ్రహ్మణ్యస్వామి) గుడి సందు మొదట్లో
* సికిందరాబాద్ మోండా మార్కెట్లో
* హెరిటేజ్ వాళ్ళ వెజిటబుల్ స్టోర్స్ లో
* సికిందరబాద్ తాడ్బంద్ చౌరస్తాలో చౌపాల్ వెజిటబుల్ స్టోర్స్లో
* నల్లకుంట (శంకర మఠం దగ్గర) వెజిటబుల్ మార్కెట్ వీధిలో
* కొన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా అప్పుడప్పుడు పెడుతూంటారు.
నాకు తెలిసిన ప్రదేశాలైతే ఇవేనండీ.వీటిల్లో మీకు దగ్గరలో ఏ ప్రదేశముందో అక్కడ ప్రయత్నించండి. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. చేసుకున్నాకా ఎలా ఉందో చెప్పాలి మరి..:)
వావ్..మంచి వంటకం చెప్పారు...నేను చేసేసి, తినేసి అప్పుడు మీకు రిపోర్ట్ ఇస్తా ఎలా వచ్చాయో!
@ఆ.సౌమ్య: ok ok...:)
evei tolginchali.naku ardam kaledu.tolginchaka migilina dani photo kuda pettara meeru.
naku deenitho vantakalante istam .
kani evi teeyalo teliyaka eppudu chesukoledu
@sravya:టపాలోని నాలుగవ ఫోటోలో రైట్ సైడ్ ఉన్న రెండూ తీసేయాలండి. మధ్యలో పొడుగ్గా ఉండేదాని "దొంగాడు" అంటారు..:) అదే చేదుగా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ గా ఉండేది కూడా తీసేయాలి. ఇంకా అర్ధం కాకపోతే మరి ఎవరన్నా పెద్దవాళ్లని అడగండి చెప్తారు.
ధన్యవాదాలు.
సూపరో సూపరు. మా ఆవిడకు ట్రైనింగ్ ఇస్తాను.
అదే చేత్తో అరటి పువ్వు వడలు యే హోటల్లో దొరుకుతాయో చెప్పెయ్యండి.
@Ravi:వడలు ఎలా వచ్చాయో చెప్పండి. ఏ హోటల్లో దొరుకుతాయో తెలీదండి.. సినిమాలోనే అమ్మారేమో :-) Thank you.