మార్కెట్లో చిన్న చిన్న మావిడికాయలు దొరకటం మొదలవగానే మా ఇంట్లో మొదట అమ్మ మెంతిబద్దలు పెట్టేసేది. ఆ తరువాత చిన్న చిన్న మావిడి పిందెలు సంపాదించి బుల్లి బుల్లి ముక్కలు కోసి ఆవకాయ పెట్టేసేది. పెద్ద మావిడికాయతో కన్నా ఇలా చిన్న చిన్న పిందెలతో పెట్టిన ఆవకాయ బద్దలు చాలా రుచిగా ఉంటాయి. లార్జ్ స్కేల్లో కొత్తావకాయ, మాగాయ, మెంతికాయ మొదలైనవి పెట్టుకునేదాకా టెంపరరీ రిసోర్సెస్ అన్నమాట ఇవి.
క్రితం వారం ఉగాదికి కొన్న చిన్న మావిడికాయ ఒకటుంటే నేనూ మెంతిబద్దలు వేసాను. చాలా బాగా కుదిరింది. చాలా వంటలు అలా కొంచెం చేసినప్పుడే బాగా వస్తూంటాయి ఎందుకో మరి. 'మెంతిబద్దలు' తెలియనివారికి ఎలా చేస్కోవాలో చెప్పెయ్యనా?
* ఆవాలు, మెంతులు 1:1 పాళ్ళలో విడివిడిగా పొడి మూకుడులో ఎర్రగా వేయించుకోవాలి. ఆవాలు వేలితో నొక్కితే పొడుం అవ్వాలి. అప్పుడు బాగా వేగినట్లు. కానీ మాడకూడదు. మెంతులు కూడా ఎర్రగా వేగాలి నల్లగా అవ్వకూడదు.
* ఒకటి రెండుకాయలకైతే ఆవాలూ,మెంటులు కలిపి వేయింఛుకోవచ్చు. కానీ నాలుగైదు కాయలకైతే ఆవాలు విడిగా, మెంతులు విడిగా వేయించుకోవాలి.
* నూనె వేడిచేసుకుని అందులో కాస్త ఇంగువ వేసి వేగాకా అందులో కారం (ఆవాలు,మెంతులతో సరిపోయేంత కొలత) వేసి స్టౌ ఆపేయాలి. కారం మరీ నల్లబడిపోకూడదన్నమాట.
* ఈ మిశ్రమం చల్లారాకా తొక్కు తీసేసి తరిగి ఉంచుకున్న చిన్న చిన్న మవిడి ముక్కలు, ఉప్పు అందులో కలిపేయటమే. మెంతిబద్దలు రెడీ.
hi trushna garu erojae nenu pettanu ee pachandi chala baga vachndi , thnks 4 d recipe
aavaalu menthulu vEgaaka grinD cheyyaali kadaa?
Ennela garu, avunandi vidi vidigaa , rendoo vegaaka grind cheyyali.paina raasaanandii..
hi trishna gar one small doubt..avalu menthulu, karam oka 2 medium size mangoes ki entha quantity lo teesukovalo chepthara..thanks in advance..
@srujana: for two mangoes 1/2 tea glass i.e approx. 50gms each is ok.
oil: 1 full tea glass
my tip: Its always good if mango pieces are more.
thank you.
@srujana: for two mangoes 1/2 tea glass i.e approx. 50gms each is ok.
oil: 1 full tea glass
my tip: Its always good if mango pieces are more.
thank you.
thanq Trishna garu..