
బీరకాయ అట్టు మా తాతమ్మగారు(నాన్న అమ్మమ్మగారు) మా చిన్నప్పుడు చేసేవారు. తరిగిన బీరకాయ ముక్కలూ, నానబెట్టిన గుప్పెడు బియ్యాన్ని కలిపి, పచ్చిమిర్చి వేసి రోటిలో రుబ్బి అట్టులా వేసి అన్నంలో (కూర బదులు) నెయ్యి వేసి, ముద్దలు చేసి తినిపించేవారు. ఆ రుచి నాలిక మీదే ఉంటుంది ఇప్పటికీ. వంటలో అంత గొప్ప చెయ్యి ఆవిడది. చాలా ఓర్పుగా, నిదానంగా చేసుకోవాల్సిన అట్లు ఇవి. రుచి మాత్రం అమోఘం. నాకు బాగా ఇష్టం.
పెద్దయ్యాకా తాతమ్మలా బీరకాయ అట్టు చేద్దామని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను....:) చిన్నప్పుడు తెలీదు మరి ఇలా వంటలు వండుతానని. లేకపోతే...