శ్రావణమాసం వచ్చిందంటే నోములు, పేరంటాలు, వాయినాలు శనగలు...! ఆ శనగలతో వడలు, వాటిని పొగచడం, పాఠోళీ, చోలే కూర మొదలైన రకలన్నీ ఇంట్లో చేసేవారు. అన్నింటికన్నా నాకు బాగా ఇష్టమైనది పాఠోళీ.
ఈ వంటకానికి ఈ పేరు ఎలా వచ్చింది వగైరా వివరాలు తెలీదు కానీ అది చేయటమ్ మాత్రం నేర్చుకున్నాను.
పాఠోళీ చేసే విధానం:
* ఇది పెద్ద (తెల్ల)శనగలు కాకుండా నల్లగా, చిన్నగా ఉండే శనగలతో చేసుకుంటేనే రుచిగా ఉంటుంది.
* మొలకెత్తిన లేక నానబెట్టిన శనగలు ఉంటే సరే, లేకపోతే ముందురోజు రాత్రి శనగలు నానబెట్టుకోవాలి.
* పచ్చి శనగలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు చల్లుకోవచ్చు రుబ్బేటప్పుడు కానీ మరీ పేస్ట్ లా అవకూడదు.
(ఎవరు తినగలిగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి వాళ్ళు వేసుకోవాలి. నేనయితే పావుకేజీ శనగలకు 4 పచ్చిమిర్చి వేస్తాను.)
* పావుకేజీ శనగలకు రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్నగా తరుగుకోవాలి. ఎత్తుకి ఎత్తు ఉల్లిపాయలు వేస్తే రుచి అని చెప్పేది అమ్మ.
* ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, కర్వేపాకు, చిటికెడు పసుపు వేసి పోపు వేగాకా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.
(శనగలతో కూర కాబట్టి పోపులో శనగపప్పు వేయనక్కరలేదు. కావాలంటే వేసుకోవచ్చు.)
* తరువాత గ్రైండ్ చేసుకున్న శనగల ముద్దను వేగిన ఉల్లిపాయముక్కల్లో వేసి కూర అడుగంటకుండా,మాడకుండా కలుపుతూ ఉండాలి.
* కాసేపటికి కూరంతా పొడిపొడిగా అవుతుంది.
* బాగా వేగింది అనిపించాకా దింపేసుకోవటమే. దగ్గర ఉండి మాడిపోకుండా ఎంత బాగా వేయించగలిగితే అంత రుచి ఈ కూర.
* వేడి వేడి అన్నంలో తినటానికి చాలా బాగుంటుంది.
ఇవి పచ్చి సనగలు:
బొంబాయిలో పచ్చి శనగలు బాగా అమ్ముతారు. మేము వెళ్ళిన కొత్తల్లో అవేమిటో తెలిసేవికాదు. తర్వాత నేను కూడా కొని కొన్ని వంట ప్రయోగాలు చేసాను.
*******************************
నల్ల శనగల్లోని పోషకాలు + ఉపయోగాలు:
* వీటిలో ఫోలేట్, ప్రోటీన్, కార్బొహైడ్రేట్లు ఉంటాయి.
* వీటిలో ఫైబర్(పీచుపదార్ధం) ఉంటుంది, కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.
* కేల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫోస్ఫరస్ మొదలైన మినరల్స్ కూడా వీటిల్లో ఉంటాయి.
* రక్తం లోని కొలెస్ట్రాల్ ను కూడా ఇవి తగ్గించగలవని ఇటీవలి పరిశోధనల్లో ఋజువైందట.
* ఈ శనగలను ఉడకపెట్టుకుని తింటే కడుపు నిండినట్లనిపిస్తుంది + మంచి ఎనర్జీను ఇస్తాయి.
నల్ల శనగల్లోని పోషకాలు + ఉపయోగాలు:
* వీటిలో ఫోలేట్, ప్రోటీన్, కార్బొహైడ్రేట్లు ఉంటాయి.
* వీటిలో ఫైబర్(పీచుపదార్ధం) ఉంటుంది, కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.
* కేల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫోస్ఫరస్ మొదలైన మినరల్స్ కూడా వీటిల్లో ఉంటాయి.
* రక్తం లోని కొలెస్ట్రాల్ ను కూడా ఇవి తగ్గించగలవని ఇటీవలి పరిశోధనల్లో ఋజువైందట.
* ఈ శనగలను ఉడకపెట్టుకుని తింటే కడుపు నిండినట్లనిపిస్తుంది + మంచి ఎనర్జీను ఇస్తాయి.
తృష్ణ గారు చాలా బాగుంది మీరు చెప్పిన విదానం .పట్రోలివిన్నాను కానీ ఎలా చేయాలో సరిగాతెలియదు.చుసానుకదా తప్పక ట్రై చేసాను.
తృష్ణ గారు, నానబెట్టిన శెనగలను ఉడికించకుండానే రుబ్బాలా?
పాట్రోళీ నా లేక పాటోళీ నా?
Baagundandi.. Eee sari try chestanu.
@radhika(naani):తప్పకుండా చేయండి చాలా బగుంటుండి.
@photodummy:పచ్చి శనగలనే రుబ్బాలండీ.
@సూర్యుడు: పేరు సరిగ్గా కనుక్కున్నానండీ...
"పాఠోళీ" ట. వాడుకలో ఒక్కో చోటా ఒకోలా పలుకుతారేమోనండీ.
@ohh baby:తప్పకుండా చేయండి. చాలా బాగుంటుంది.
చాలా బాగా చెప్పారు. ఇప్పుడే శనగలు నాన పెట్టి వచ్హాను..రేపు తప్పకుండా ట్రై చేస్తాను..
మా ఇంట్లో పచ్చి సెనగపప్పు నానపెట్టి చేస్తారు పాఠోళీ1 రుచి అదుర్సే కానీ బోల్డంత నూనె పడుతుందండీ, ఆరోగ్యానికి అంత మంచిది కాదు.శనగలు కూడా పూర్తిగా వేగిపోతాయి కదా! గోరు చిక్కుళ్ళతో కూడా పాఠోళీ చేస్తారు! మల్లాది వెంకట కృష్ణ మూర్తి తన వంటల పుస్తకంలో రాశాడు.
పాఠోళీ చేసినపుడు మా అత్తగారు తెల్ల వంకాయలు కాల్చి పచ్చి పులుసు(కొంతమంది పులుసు పచ్చడి అంటారు)చేస్తారు కాంబినేషన్ గా!
ఇంతా చేసి పాఠోళీ మీద మనకు పేటెంట్స్ లేవు. కర్నాటక/మహారాష్ట్ర వాళ్ళ వంటకం ట ఇది.
@మహా: బాగా వచ్చిందాండీ?
@సుజాత: మా ఇంట్లో కూడా గోరుచిక్కుడుతో చేస్తారండి. దానికి ఎక్కువ నూనె పట్తదు టేస్ట్ కూడా బాగుంటుంది.
శనగలతో చేస్తే నూనె ఎక్కువే పడుతుంది కానీ వన్స్ ఇన్ ఏ వైల్ పర్వాలేదనిపిస్తుందండి నాకు. అప్పుడప్పుడు ఐస్క్రీమ్ తినేస్తాం కదా అలాగ..!
నిజంగా చాలా రుచిగా వుంది..మావారు కొత్త వంటకం అంత తొందరగా నచ్చినది అని చెప్పరు .. కాని ఇది చాల ఇష్టం గా తిన్నారు..చాలా బాగుంది అని చెప్పారు.. ముందుగా మీకు ధన్యవాదములు..
తృష్ణ గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు
హారం
@maha: good that U've done it well..thankyou verymuch.
@bhaskara rami reddy: Thankyou for the wishes..wish you the same.
అక్కా చాలా బాగుంది ఈ కూర నేను మొన్న మా ఫ్రెండ్ చేస్తే తిన్నాను
తృష్ణ గారూ,
గోరుచిక్కుళ్ళతో పాఠోళీ అన్నారే.. దయచేసి అదెలా చేయాలో చెప్పరా!
maaayana ammamma garu nanina sanagalaku opigga pottu tesi komchem kandipappu nana petti adi kuda ee sanagalato rubbichestaru adi kuda baguntundi eesari try cheyandi
@sujata:అవునండి మా మామ్మగారు కూడా ఓపిగ్గా శనగల తొక్క తీసే చేసేవారు. కందిపప్పు వేసేవారో లేదో తెలీదు కనుక్కోవాలి.