అట్లు చాలా రకలు ఉన్నాయి. వాటిల్లో చేతి అట్లు ఒక రకం. పిండి కొంచెం గట్టిగా కలుపుకుని చేతితో(చెయ్యి కాలకుండా) పెనం మీద వేసే అట్టుని "చేతి అట్టు" అంటాము. అలా చేసుకునే చేతి అట్లలో ఒకటి సగ్గుబియ్యం అట్టు. సగ్గుబియ్యంతో ఒడియాలు,పరమాన్నం, హల్వా, కిచిడీ, వడలు మొదలైనవి ఎప్పుడూ చేసుకునేవే. ఈ సగ్గుబియ్యం అట్టు నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. నాకు బాగా నచ్చుతుంది. స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ కాన్షియస్, డయాబెటిక్ అయితే వాడటం మంచిది కాదు. అయితే ఈ అట్టులో బంగాళాదుంపలు కలుపుతాం కాబట్టి పిల్లలకు మంచి ఎనర్జీ నీ ఇస్తుంది. నెలకోసారి సరదాగా ట్రైచేయచ్చు.
క్రింద బొమ్మలోనిది పెండలం మొక్క. ఈ మొక్క తాలూకూ వేరులే పెండలం దుంపలు. (చిలకడ దుంపల్లాగ). ముదురు గోధుమరంగులో సన్నగా పొడుగ్గా ఉంటాయి. వాటిల్లోంచి సగ్గుబియ్యం తయారు చేస్తారు. పెండలం(tapioca) నుంచి తయారుచేయబడిన సగ్గుబియ్యాన్ని tapioca pearls అంటారు.
ఒక సంగతి:
బంగాళాదుంపలు తినకూడదన్నది ఒక అపోహ. ఇవి మధుమేహం ఉన్నవారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ తినదగిన పౌష్టికాహారం. ఉడికించిన వాటిల్లో కార్బోహైడ్రేట్స్,విటమిన్ బి,సీ,ఇంకా కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. నూనెలో వేయించితేనే అది హానికరం.పప్పు దినుసుల్లో కన్నా ఎక్కువ తేమ బంగాళాదుంపల్లో ఉంటుంది,అందువల్ల పప్పుదినుసులలో కన్న తక్కువ కేలరీలు వీటిల్లో ఉంటాయి.ఉడికించిన బంగాళాదుంపముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మరసం,కొత్తిమీర చల్లుకుని సాయంత్రాలు టీ టైం లో తినచ్చు. అయితే,తొక్కతీసి ఉడికించినా,తొక్క బ్రేక్ అయ్యేలా ఎక్కువ ఉడికించినా వీటిలోని పోషకాలన్నీ నశిస్తాయి. ఈ సంగతి నేనొక పుస్తకంలో చదివి తెలుసుకున్నది.
సగ్గుబియ్యం అట్టుకు కావాల్సిన పదార్ధాలు:
* ఒక కప్పు సగ్గుబియ్యం (రెండు కప్పుల నీటిలో 3-4 గంటలు నానబెట్టాలి.
* 3 మీడియం సైజు బంగాళాదుంపలు (ఉడకపెట్టుకుని తొక్కు తీసుకున్నవి)
* సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి (కారం అవసరమైతే)
* అంగుళం(1/2 inch ) అల్లం తురుముకోవాలి
* సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయలు
* రెండు చెంచాల బియ్యప్పిండి లేదా శనగపిండి(మిశ్రమం దగ్గరపడటానికి)
* ఒక చెంచా జీలకర్ర
* తగినంత ఉప్పు
* అట్టు కాల్చటానికి ఒకోదానికీ 1/2 చప్పున నూనె
తయారీ:
* పైని పదార్ధాలన్నింటినీ(నూనె తప్ప) కొద్దిగా నీరుతో కలుపుకోవాలి క్రింద చూపిన విధంగా.
* పెనం కాలాకా, పిండిని పెనం మీద గుండ్రంగా పరచాలి క్రింది విధంగా. చేతిని నీటితో తడిపుకుని అట్టు వేస్తే త్వరగా చెయ్యి కాలకుండా వెయ్యగలుగుతాము.
చుట్టుతా ఒక అరచెంచా నూనె వేసి, రెండు మూడు నిమిషాల తరువాత అట్టు వెనకకు తిప్పుకోవాలి.
* చాలా రుచిగా ఉండే ఈ అట్లను ఏ చట్నీ తోనైనా తినవచ్చు. చల్లని సాయంత్రాలు లేదా ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు చేసుకుంటే వెరైటీగా బాగుంటాయి. హెవీ టిఫిన్ కాబట్టి ఎక్కువ అట్లు వేయక్కర్లేదు... :)
I have tried it immediately after reading this. Made a nice diner for us :)
@srujana: that's great. Its our periodical dinner menu too...:)
త్రుష్ణ గారు,
మంచి రెసీప్ చెప్పారు...
దీన్ని పోలి ఉండెదే "తెప్పాల చెక్క" అని బియ్యంపిండి మరియు పచ్చిశెనగపప్పుతో చేస్తారు...
ఈసారి మీ రెసీప్ ట్రై చెయ్యాలి...
@raj:చెప్పేసారా... నెక్స్ట్ టైం దాని గురించే రాద్దామ్ అనుకుంటున్నానండీ...!
gayathri,
i have tried this attu. Its really nice. i have added grated carrot to it.