మరుగున పడిపోతున్న మంచి మంచి ఆంధ్రా వంటకాల్లో ఒకటి ఈ అరటికాయ పొడి కూర. వంకాయను కాల్చి పచ్చడి చేసినట్లు అరటికాయను కూడా కాల్చి ఈ కూర చేస్తారు. ఓపిక ఉంటే అరటికాయను కుంపటిలో కాల్చవచ్చు లేదా స్టౌ మీద కూడా కాల్చవచ్చు.
ఎలా చెయ్యాలంటే:
* ముందుగా పచ్చి అరటికాయకు కాస్త నూనె రాసి పొయ్యి మీద పెట్టాలి. అన్నివైపులా అరటికాయ బాగా కాలేలా కాల్చాలి. (ముచిక బాగ కాలి రాలిపోతే అతఇకాయ బాగా కాలినట్లు.) క్రింద ఫోటోలోలాగ.
* కాల్చిన అరటికాయ కు (మీ కారానికి)తగినంత అల్లం,పచ్చిమిర్చి ముద్ద తొక్కి పెట్టుకోవాలి.
* తర్వాత మూకుడులో రెండు చెంచాల నూనె వేసి, శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,చిటికెడు పసుపు,కర్వేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగాకా అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి, అది వేగాకా మేష్ చేసిపెట్టుకున్న అరటికాయ పొడి అందులో వేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరువాత దింపేసుకోవాలి.
* చూడటానికి అరటికాయ ముక్కలు ఉడకబెట్టి అల్లం,పచ్చిమిర్చి వేసి పోపు కూర వండుకున్నట్లే ఉంటుంది. కానీ రుచిలో తేడా ఉంటుంది. నిమ్మరసం ఇష్టముంటే వడ్డించేముందు కూరలో అరచెక్క నిమ్మరసం పిండివచ్చు.
చాలా బాగుంది recipe త్రుష్ణ గారు..చేస్కోవటం కూడా చాలా తేలిక..అయితే ఒక doubt .వంకాయ అయితే కాల్చిన వెంటనే తొందరగా మెత్త పడిపోతుంది ..వాసన కూడా బాగుంటుంది..మరి అరటి విషయంలో ఇది ఎలా ఉంటుందో?i mean taste and smell..
@నైమిష్: కాలిన వాసన అసలేమీ ఉండదండీ..టేస్ట్ కూడా బావుంటుంది.
thank you.