ఓట్స్ ఉపయోగాలూ, ఉప్మా గురించి(వ్యాఖ్యల్లో) గతంలో రాసాను. ఇప్పుడు ఓట్స్ దోశ గురించి చెప్పుకుందాం..
కావాల్సినవి:
ఒక గ్లాస్ ఓట్స్
ఒక గ్లాస్ దంపుడు బియ్యం లేదా white rice
ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం (par boiled rice)
అర గ్లాసు అటుకులు
అర గ్లాసు మినపప్పు
చెయ్యటం:
* పైనవన్ని కలిపి మూడు గంటలు నానబెట్టుకున్నాకా, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
* రుబ్బిన పిండి మరో మూడు నాలుగు గంటలు అట్టేబెట్టాలి. లేదా రాత్రికి రుబ్బేసి పొద్దుటిదాకా బయట ఉంచేసి తర్వాత కూడా వేసుకోవచ్చు. అప్పుడు స్పాంజ్ దోశల్లాగ దోశలు ఉబ్బుతాయి.
* కేరెట్, చౌ చౌ, బీన్స్ మొదలైన కూరలు చిన్నగా తరిగి, కాస్త ఉప్పు వేసి ఒక్క ఉడుకు రానిచ్చి తీసేయాలి.
* దోశ వేసాకా పైన ఉడికిన కూర ముక్కలు, అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు చల్లితే ఓట్స్ దోశ రెడీ.
* కూర ముక్కలు లేకుండా ఒట్టి దోశ కూడా వేసుకోవచ్చు ఇలా...
Post a Comment