నిన్న కొన్నిరకాల ఆవకాయలు గురించి రాసాను కదా.. ఇవాళ మూడు మాగాయ రకాలు చెప్పుకుందాం. చిన్న సలహా ఏంటంటే ఆవకాయకు, మాగాయకు కూడా కాయ కొనేప్పుడు పీచు ఉన్న మావిడికాయలు ఎన్నుకోవాలి. అప్పుడవి ఏడాదంతా నిలవ ఉంటాయి.
తురుముమాగాయ:
తురుముమాగాయ:
మామిడికాయ తురిమేసుకుని ఒక ఎండలో పెట్టాలి. పొద్దున్న పెట్టి సాయంత్రం తెచ్చేసుకోవచ్చు.
మామిడికాయలు ౩
100gms మెంతులు,
75gms ఆవాలు
150gms కారం
150gms ఉప్పు
1/4kg నూపప్పు నూనె
తయారీ:
* 1/4kg నునె కాగాకా అందులో చింతగింజంత ఇంగువ వేసి కాచి ఉంచాలి. ఇంగువ వెయ్యగానే బుడగలు వస్తాయి. అప్పుడు దింపెయ్యాలి.
* ఆవాలు,మెంతులు రెండూ విడివిడిగా పొడిమూకుడులో వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడుం అయ్యేలా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన రావాలి. వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.
* తురిమిన కోరు తెచ్చుకున్నాకా ముందుగా టీ గ్లాస్ ఉప్పు వేసి కలుపుకోవాలి.
* తర్వాత అందులో కారం, ఆ తరువాత వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి ఆవ పొడి, ఇంగువ నూనె వేసి బాగా కలపాలి.
* మూడోరోజు మరి కాస్త (తగినంత) నూనె వేసి మళ్ళీ బాగా కలిపి జాడీలో దాచుకోవటమే.
---------------------------------------
మెంతికాయ:
మామిడికాయలు 6
ఉప్పు 1/4kg
కారం 1/4kg
100gms మెంతులు
40gms ఆవాలు
1/2kg నూపప్పు నూనె
ఒక చెంచా పసుపు
తయారీ:
* మావిడి ముక్కలు సన్నగా పొడుగ్గా తరిగి ఒకరోజు లేక ఒక పూట ఎండబెట్టాలి.
* 1/4kg నునె కాగాకా అందులో చింతగింజంత ఇంగువ వేసి కాచి ఉంచాలి. ఇంగువ వెయ్యగానే బుడగలు వస్తాయి. అప్పుడు దింపెయ్యాలి.
* ఆవాలు,మెంతులు రెండూ విడివిడిగా పొడిమూకుడులో వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడుం అయ్యేలా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన రావాలి. వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.
* కారంలో కాగిన నూనె కాస్త వేసి కలిపి తర్వాత ఉప్పు వేసి కలపాలి. నూనె చల్లారిన తర్వాత ఆవపిండి, మెంతిపిండి కలపాలి.
* తర్వాత ఎండిన ముక్కలు వేసి కలపాలి. తర్వాత పసుపు కూడా అందులో కలపాలి.
* మూడవ రోజున ఊట రాకపోతే కాస్త ఇంగువ నూనె కాచి చల్లార్చి ఊరగాయలో కలపాలి.
---------------------------------------
ఎండు మాగాయ:
మామిడికాయలు 4
ఉప్పు 1/4kg
కారం 1/4kg
150gms మెంతులు
150gms ఆవాలు
1 spoon పసుపు
450/500gms నూపప్పు నూనె
తయారీ:
* మామిడికాయలను తొక్కు తీసి సన్నగా పల్చగా ఉండేలా ముక్కలు పీలర్ తో పీల్ చేయాలి.
* ముక్కల్లో 1/4kg ఉప్పు, ఒక చెంచా పసుపు కలిపి జాడీలో పెట్టాలి.
* రెండవరోజు బాగా కలపాలి. మూడవరోజు జాడీలో కాస్త ఊట కనిపిస్తుంది.
* మూడవరోజు ముక్కలు మాత్రం తీసి ఎండలో పెట్టాలి. సాయంత్రం మళ్ళీ జాడిలో ఉన్న ఊటలో ముక్కలు వేసేయాలి.
* అలా ముక్కలని రెండు మూడు రోజులపాటు ముక్క విరిగేలా ఎండేదాకా ఎండబెట్టాలి. చివరిరోజు ఊట కూడా ముక్కలతో పాటూ విడిగా ఎండలో పెట్టాలి.
* ఎండబెట్టడానికి మూడురోజులు సరిపోతాయి.
* మూడవరోజు 1/4kg కారం వేసి ముక్కలు, ఊట అన్నీ కలిపాలి.
* తర్వాత ఆవాలు,మెంతులు విడివిడిగా వేయించి , విడివిడిగానే పొడి చేసుకుని ఊరగాయలో కలపాలి.
* చింతగింజంత ఇంగువ వేసి 1/4kg పప్పు నూనె కాచి, చల్లార్చి ఊరగాయలో వెయ్యాలి.
* జాడీలో పెట్టిన మూడవరోజు కాస్త ఇంగువ వేసి 200gms నూనె కాచి చల్లార్చి ఊరగాయలో కలపాలి.
oe paeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeedda thaaks vaesukoevaalanDi ikkaDa:))))
@sunita: my pleasure..:)
thank you too.
వచ్చే జనమ లో నైనా తృష్ణుడు గా పుట్టాలని గాఢంగా - కోరుకుంటున్నాను. (Not just for the nicest of the recipes alone..:D)
@sujata:అయ్యో వద్దండి... ఆ post నేను రిజర్వ్ చేసేసుకున్నాను..! వచ్చే జన్మలో నేను భర్త, తను భార్యలాగా పుట్టాలని గాట్టిగా బోలెడు రోజుల్నుంచీ కోరేసుకుంటున్నాను..:))
(రివెంజ్ తీసుకోవద్దూ..:))))