గోధుమరవ్వ ఉప్మా తిని తిని బోర్ కొట్టేస్తే ఇలా రవ్వ పొంగలి కూడా చేసుకోవచ్చు. మామూలుగా మనం బియ్యంతో చేసుకునే కట్ పొంగలి లాగానే ఇదీ కూడా.
కావాల్సినవి:
ఒక కప్పు(150gms) గోధుమరవ్వ
అర కప్పు పెసరపప్పు
నాలుగు పెద్ద చెంచాల నెయ్యి
ఐదారు జీడిపప్పు పలుకులు
రెండు పచ్చిమిరపకాయలు
రెండు ఎండుమిరపకాయలు
అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు
బరగ్గా పొడి చేసిన పది మిరియాలు
కాస్తంత కర్వేపాకు, తగినంత ఉప్పు
తయారీ:
* ముందుగా నెయ్యి లో ఆవాలు,జీలకర్ర, మిరియాలు, కర్వేపాకు మిర్చి వేసి పోపు వేయించాలి. చివరలో జీడిపప్పు వెయ్యాలి.
* తర్వాత పెసరపప్పు వేసి ఎర్రగా వేగనివాలి. పెసరపప్పు వెయ్యకుండా కూడా పొపులో గోధుమరవ్వ వేయించి పొంగలి చేసేసుకోవచ్చు. పైన ఫోటొలో పొంగలి లో పెసరపప్పు వెయ్యలేదు.
* తర్వాత రవ్వ కూడా వేసి రెండు నిమిషాలు వేగాకా కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్ళు పోసి, ఉప్పు వేసి కుక్కర్(2 ltrs or 3 ltrs cooker) మూత పెట్టేయాలి.
* రెండు విజిల్స్ రాగానే కుక్కర్ ఆపేయాలి. రవ్వ పొంగలి తయార్ !!
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్.. మా ఇంట్లో రోజూ ఇదే ;) ;)
@raj: రోజూనా?? బోర్ కొట్టదా?
మీ కొత్త రకం ఉప్మా బాగుంది
నాకు మామూలు ఉప్మా కంటే కూడా గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం
కాని నాకు సన్నగా ఉండే గోధుమ రవ్వ దొరకటం లేదు
దొరికిన ఆ ఉప్మా ఇలా రావటం లేదు
మంచి గోధుమ రవ్వ ఎలా ఎంచు కోవలో చెప్తారా
దిలీప్ గారూ, బజారులో మూడు రకాల గోధుమరవ్వలు దొరుకుతాయండి. సన్నదీ, బాగా లావురవ్వ, మధ్యరకం రవ్వ. నేను మధ్యరకం రవ్వ కొంటాను. హోల్ సేల్ పప్పుల షాపుల్లో, సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా మీకు ఇవి దొరుకుతాయి. ఇది కాక గోధుమ రంగులో ఉండి ఫైన్ గోధుమల నుంచి తయారు చేసిన బ్రౌన్ కలర్ రవ్వ కూడా దొరుకుతుంది. ఇది కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుంది. చాలా మంచిది కానీ రుచికి పైన చెప్పిన రకాలే బావుంటాయి.
ఇంకా వండేప్పుడూ ఒకగ్లాసు రవ్వకి గ్లాసుంపావు నీళ్ళు మాత్రమే పోస్తే గోధుమ ఉప్మా పొడి పొడిగా వస్తుంది.
Thanks for the visit.
Thrushna garu, meeku chala rojulanundi post cheddamani anukuntunnanu. kani, mee vantalanni[2010 nundi] chadivesariki time pattindi.mee matalu vintute sorry chaduvutunte naku ma intilo vunnatle vuntundi. balyam antha gurtuku vastundi. tatammagaru,uppudupindi ee padalu chustunte pranam lechi vastondi.vantalu kuda suuuuuuperb