ఎప్పుడో కాని దొరకని జున్ను అంటే ఇష్టం ఉండని వారుంటారా? (సాధారణంగా ఉండరు గానీ ఉంటారు.. కొందరు తెలుసు నాకు :)) ఆవు లేదా గేదె ఈనిన తరువాత ఇచ్చే మొదటి మూడు రోజుల తాలూకూ పాలనూ జున్ను పాలు అంటారు. కేనుల్లో తెచ్చి పాలు పోసేవాళ్ళ దగ్గర అడిగితే ఆవు/గేదె ఈనినప్పుడు జున్నుపాలు తెచ్చి పెడతారు. మొదటిరోజు పాలు అయితే ఒకటికి ఒకటి చప్పున మామూలు పాలు కలిపి జున్ను వండుతారు. రెండవరోజు, మూడవ రోజు పాలు అయితే డైరెక్ట్ గా వండేస్తారు.
జున్ను పాలు |
జున్ను తయారీ ఎలాగంటే:
* జున్ను పాలు అర లీటరు ఉంటే, అవి మొదటి రోజువైతే మరో అరలీటరు మామూలు పాలు కలపాలి.
* రెండవరోజు, మూడవ రోజు పాలు అయితే అవి చాలు
* అలా కలిపిన లీటరు పాలకి మూడొందల గ్రాముల బెల్లం తరుగు వేసి, బెల్లం కరిగేదాకా బాగా కలపాలి. మీ రుచికి సరిపడా ఎక్కువ గానీ తక్కువ గానీ బెల్లం వేసుకోవచ్చు .
* బెల్లం బాగా కలిసాకా పాలు వడపొయ్యాలి. బెల్లంలో ఏదన్నా తుక్కు ఉంటే వచ్చేస్తుంది.
* అప్పుడు జున్నుపాలలో పది మిరియాలు బాగా పొడి గొట్టి కలపాలి.
* కొంతమంది ఏలకులు,మిరియాలు కలిపి పొడిచేస్తారు. నేను మిరియాలొక్కటే వేస్తాను. లేదా ఏలకులు. రెండూ కలపను.
* ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో గ్లాసుడు(300lm) నీళ్ళు పోసి, జున్నుపాలు ఉన్న గిన్నెను అందులో పెట్టాలి. కుక్కర్ కి విజిల్ పెట్టకుండా పొయ్యి సిమ్ లో ఉంచి ఒక ఇరవై నిమిషాలు తర్వాత స్టౌ కట్టెయ్యాలి.
* కుక్కర్ మూత తీసి జున్ను లో చాకు గుచ్చి చూడాలి. చాకుకి ఏమీ అంటకపోతే జున్ను తయారయిపోయినట్లే. చాకుకి ఏదన్నా పాలలా అంటితే మరో ఐదుపదినిమిషాలు పొయ్యి మీద ఉంచి ఆపేయాలి.
* తయారైన జున్నుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. వారం రోజుల దాకా పాడవ్వదు.
బెల్లం వేసిన జున్ను |
పంచదార జున్ను |
జున్ను పాలు లేకుండా కూడా జున్ను చేస్తారు. బజార్లో అమ్మే 'జున్ను పౌడర్' తో కాదు. కండెన్స్డ్ మిల్క్ తో.
ఒక కప్పు హోల్ మిల్క్,
అర కప్పు కండెన్స్డ్ మిల్క్,
పంచదార లేదా బెల్లం తరుగు అరకప్పు,
మిరియాల పొడి లేదా ఏలకులు అరచెంచా,
ఇవన్నీ కలిపేసి పైన చెప్పిన జున్ను లాగే కుక్కర్లో ఓ అరగంట ఉడికించాలి.
కొందరు ఈ మిక్స్ లో ఒక egg కూడా గిలకొట్టి వేస్తారు. అసలు జున్ను రుచి దీనికి రాదు కానీ ఇది కూడా బానే ఉంటుంది.
My fav....
Photos choodagaane tineyyalanipistondi.
China grass n milk to koodaa cheyochchu....
thanks anu gaaru. చైనా గ్రాస్ తో చేస్తారని విన్నా గానీ ఎప్పుడూ ప్రయత్నించలేదండి..
ధన్యవాదాలు.