with wheat atta |
మామూలుగా రవ్వదోశకి కావల్సినవి:
బియ్యప్పిండి : ఒక గ్లాసు
మైదా : 3/4 గ్లాసు
బొంబాయి రవ్వ : ఒక గ్లాసు
కాస్త పుల్ల మజ్జిగ : రెండు గ్లాసులు
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,
తురిమిన కేరెట్
జీలకర్ర ఒక చెంచా, 1/4 spoon ఇంగువ
తయారీ:
* బియ్యప్పిండి, మైదా, రవ్వ మూడూ చిలికిన మజ్జిగలో కలిపేసి, జీలకర్ర, 1/4 spoon ఇంగువ, తగినంత ఉప్పువేసి ఓ అరగంట అయినా నాననివ్వాలి.
* దోశలు వేసే ముందర పిండి గట్టిగా అనిపిస్తే మరిన్ని నీళ్ళు పోసి పిండి బాగా జారుగా చేసుకోవాలి.
* పల్చగా ఉన్న పిండి, పెనం మీద దోశ వేసాకా ఇంక కదపలేము కాబట్టీ వేసేప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి.
* మామూలు దోశ మధ్యలో పిండి వేసి గరిటతో గుండ్రంగా తిప్పుతూ వస్తాము కదా, ఇదేమో పెన మంచుల నుండి గుండ్రంగా పిండి పోసుకుంటూ మధ్యకు రావాలి.
with maida |
జొన్నపిండి కలిపిన రవ్వదోశ:
పై పాళ్ళన్నీ అలానే మైదా బదులు జొన్నపిండి కలపడం .అంతే!
with jowar atta |
గోధుమపిండీ కలిపిన రవ్వదోశ:
మైదా బదులు గోధుమపిండి.. కానీ కాస్త పాళ్ళు తేడా.
ఇక్కడ: బొంబాయి రవ్వ : 3/4 గ్లాసు
గోధుమ పిండి : 3/4 గ్లాసు
బియ్యప్పిండి : ఒక గ్లాసు
మిగిలినవన్ని పైన చెప్పినవే.
with wheat atta |
టిప్స్:
* రవ్వ దోశలు వేసే ముందర ఓ గుప్పెడి బొంబాయి రవ్వ పిండిలో కలిపితే దోశలు క్రిస్పీగా వస్తాయి.
* దోశ వేసే ముందర పెనం మీద ఉల్లిపాయ ముక్కలు, అల్లం, మిర్చి వేసేసుకుంటే వెనకవైపు తిప్పి కాల్చినప్పుడు ఉల్లిపాయ ముక్కలు మాడవు.
* అల్లo తురిమి పిండిలో కలిపేసుకోవచ్చు.
* కేరెట్ అట్టు తీసే ముందర పైన చల్లుకుంటే తురుము మాడకుండా ఉంటుంది.
* మజ్జిగ ఇష్టం లేకపోతే నీళ్ళతో కూడా రవ్వదోశలపిండి కలుపుకోవచ్చు కానీ అర కప్పు మజ్జిగ అయినా కలిపితే రుచి బాగుంటుంది.
ఓహో, నేనసలు ఎప్పుడూ గోధుమపిండే వాడతాను :-) మా అమ్మ అలాగే నేర్పింది నాకు. మైదా వాడతారని నాకు తెలియదు..ఇవ్వాళే తెలిసింది :-)
బాగుందండి. ఈ సారి నేను గోధుమపిండి తో చేస్తాను. చాలా థాంక్స్ తృష్ణ గారు.
@S:అవునా..బాగుందండి..
ధన్యవాదాలు.
@జయ: బాగుంటాయి. ప్రయత్నించండి.
ధన్యవాదాలు.