ఎండబెట్టిన తరువాత వడియాల్లా అయిపోయే కూరముక్కలను "ఒరుగులు" అంటారు. దొండకాయ, వంకాయ, బెండకాయ, కాకరకాయ మొదలైన కూరలతో ఒరుగులు చేస్తారు. పండిన కూరలు ఉంటే వాటిని తరిగి ఉప్పు, కారం రాసి ఎండబెడితే అవి ఒరుగులైపోతాయి. పచ్చివి కూడా తరిగి ఎండబెట్టుకోవచ్చు. నేను ఒడియాలతో పాటూ ఈ ఒరుగులను కూడా చేస్తూంటాను. పప్పులో, పులుసుల్లో అప్పడాల స్థానంలో ఒరుగుల్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడన్నా కూర లేకపోతే వీటిని వేయించుకుని కూరలాగే అన్నంలో అద్దుకు తినేసేవాళ్ళం చిన్నప్పుడు.
నాకు ముఖ్యంగా కాకర, దొండ ఒరుగులు ఇష్టం. ఎండల్లోనే కాక మామూలు రోజుల్లో కూడా వీటిని చేస్కోవచ్చు. కానీ కొంచెం ఎక్కువ రోజులు ఎండబెట్టాలి అంతే. ఒక తడవ అయిపోగానే మళ్ళీ ఓ కేజీ కొనేసి అన్ని కాలాల్లోనూ ఒరుగులు చేసేస్కుంటూ ఉంటాను నేను. కాకరకాయ కూర తినలేనివాళ్ళు ఇలా ఒరుగుల్లా చేసుకుంటే చేదు రుచి తెలీకుండా తినవచ్చు.
చేసుకోవటం ఎలాగంటే: పచ్చివి కానీ పండువి కానీ కాకరకాయలు గుండ్రంగా తరుక్కుని ఉప్పు,కారం రాసి మంచి ఎండలో రెండు రోజులు బాగా ఎండబెట్టడమే. ఒరుగులు రెడీ. మరి మీరూ చేసేయండి.
బాగున్నాయండి..వీటిని నూనెలో ఫ్రై చెయ్యకుండా తింటే బాగుంటాయా?
@నైమిష్: మీరు మరీనండి.. వడియాల్లా ఎండిపోయినవాటిని వేయించకుండా ఎలా తినగలమండి? (కోప్పడేయకండి...మీ ప్రశ్న చూసి భలే నవ్వొచ్చింది..:))
Thanks for the visit.
త్రుష్ణగారు ఏమి చేస్తాం చెప్పండి ...నా బాధ నాది..నూనెలో వేయిస్తే కొవ్వు , కొలెస్త్రాల్ పెరుగుతాయంటారుకదా..అందుకే డైరెక్టుగా తినచ్చేమో అని అడిగా
@నైమిష్:అప్పడాలు వేయించుకు తినే కన్నా ఇది చాలా నయం అండి. వేయించాకా టిష్యూ పేపర్ మీద వేస్కోవాలని టపాలో రాయటమ్ మరిచా. అలా టిష్యూ మీద వేస్కుంటే చాలా బెటర్.
తృష్ణగారూ! నక్కదోస ఒరుగులు పెడతాం మాఇళ్ళల్లో..అద్భుతంగా ఉంటాయ్...ః)