skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

బీరకాయ అట్టు

9:35 PM | Publish by తృష్ణ


బీరకాయ అట్టు మా తాతమ్మగారు(నాన్న అమ్మమ్మగారు) మా చిన్నప్పుడు చేసేవారు. తరిగిన బీరకాయ ముక్కలూ, నానబెట్టిన గుప్పెడు బియ్యాన్ని కలిపి, పచ్చిమిర్చి వేసి రోటిలో రుబ్బి అట్టులా వేసి అన్నంలో (కూర బదులు) నెయ్యి వేసి, ముద్దలు చేసి తినిపించేవారు. ఆ రుచి నాలిక మీదే ఉంటుంది ఇప్పటికీ. వంటలో అంత గొప్ప చెయ్యి ఆవిడది. చాలా ఓర్పుగా, నిదానంగా చేసుకోవాల్సిన అట్లు ఇవి. రుచి మాత్రం అమోఘం. నాకు బాగా ఇష్టం.

పెద్దయ్యాకా తాతమ్మలా బీరకాయ అట్టు చేద్దామని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను....:) చిన్నప్పుడు తెలీదు మరి ఇలా వంటలు వండుతానని. లేకపోతే నాన్నమ్మ దగ్గర అడిగి రాసుకున్నట్లే తాతమ్మ దగ్గర కూడా చిట్కాలు రాసుకుని ఉండేదాన్ని. ఆవిడ నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు కాలం చేసారు. ఇక నేను నా సొంత బుర్ర ఉపయోగించి బీరకాయ అట్టుపై ప్రయోగాలు చేసాను. కాస్తంత బియ్యం నానబెట్టి గ్రైండ్ చెయ్యటం, అది మెత్తగా అవక, అట్టు సరిగా రాక తిప్పలు పెట్టేది.


అప్పుడు తెలివిగా బియ్యానికి బదులు బియ్యప్పిండి ని వాడాను. ఈసారి పిండి బానే వచ్చింది కానీ అట్టు విరిగిపోయింది. ఆ తరువాత నేను పరిశోధనలవల్ల తెలుసుకున్నది ఏమిటంటే బీరకాయలో నీరు ఉంటుంది కాబట్టి ముక్కల్ని గ్రైండ్ చేసేప్పుడు నీళ్ళు పొయ్యకూడదు. ముద్ద తయారయ్యాకా కూడా అట్టు లాగ రూపాంతరం చెందటానికి ఒక
బైండింగ్ ఏజెంట్ కావాలి. అది బియ్యమే కానఖ్ఖర్లేదు. ఏదో ఒక పిండి పదార్ధం బీరకాయముక్కలను అట్టు రూపంలో బైండ్ చెయ్యటానికి ఉండాలి అంతే.

ఇక అప్పటినుంచీ బియ్యప్పిండికి బదులు నానబెట్టిన పెసరపప్పు లేక గోధుమపిండి లేక జొన్న పిండో లేక శనగపిండో కలిపేసి అట్టు వెయ్యటం మొదలుపెట్టాను...:) కాకపోతే
ఏ పీండి అయినా బీరకాయ రుచి పోకుండా తగుమాత్రంలోనే కలపాలి. Just అట్టు విరగకుండా అన్నమాట. so, మీరు కూడా రకరకలు ట్రై చెసి ఏ రుచి బాగుంటే ఆ రుచితో i.e ఆ పిండితో continue అయిపొండి.


విధానం:

* బీరకాయల్ని పైన చూపిన విధంగా సన్నటి చెక్కు తీసి, మిగిలిన తొక్కుతో కలిపి ముక్కలు చేసుకోవాలి.




* ఒక పెద్ద బీరకాయకు(nearly 300gms) --
-- రెండు పచ్చిమిరపకాయలు,
-- కాస్త కొత్తిమీర
-- గుప్పెడు నానబెట్టిన పెసరపప్పు
-- గుప్పెడు బియ్యప్పిండి
(ఈ రెండు పిండిలు బదులు పైన నేను రాసిన ఏ పిండి అయినా తగుమాత్రంలో ట్రై చెయండి)
మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో ఒక చెంచా జీలకర్ర వేయాలి.
ఇలా ఉంటుంది ఆ పిండి --


అప్పుడు ఆ పిండిని పెనం మీద వేసుకోవాలి. ఇలా --



ఈ అట్లను స్టౌ తగ్గించే వేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి.
ఇవి మరీ పెద్దగా, సన్నగా రావు ఇవి. అందుకని చిన్న సైజ్ లోనే వేసుకోవాలి. low flame వల్ల టైం పడుతోందని, ఒకోసారి విరిగిపోతున్నాయని, నేను బీరకాయఅట్లను బుల్లి బుల్లిగా వెయ్యటం మొదలుపెట్టాను. ఇలా --


బేబీ బీరకాయట్లు అన్నమాట. చిన్నగా ఉంటాయి, లేట్గా వేగుతాయి, పోటీ వచ్చేవారు కూడా ఎవరూ లేరు కాబట్టి ఒక వాయి అయ్యే లోపూ ముందర వేసిన ప్లేట్ నేనే ఖాళీ చేసేస్తాను...:)


మా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నేనూ, అన్నయ్య కలిపి శాస్త్రోక్తంగా బిరకాయ అట్లు చేసుకుని తాతమ్మను తలుచుకుంటూ, ఆహ ఏమి రుచి అనుకుంటూ తినేస్తాము...!!
వీటికి చట్నీ ఏమీ అఖ్ఖర్లేదు. అన్నంలో కానీ ఉట్టిగా గాని తినేయచ్చు.
అదీ బీరకాయ అట్టు కథ. బాగుందా ??

Labels: అట్లు - రకాలు 9 comments
9 Responses
  1. కొత్త పాళీ Says:
    October 1, 2010 1:12 AM

    సూపర్. ఫొటోలతో సహా పెట్టినందుకు నెనర్లు. ఇప్పుడు నాకు అర్జంటుగా నోరూరిపోతోంది. ఇవ్వాళ్ళ ఇంటికెళ్ళే దార్లో ఇండియన్ షాపులో ఆగి బీరకాయలు పెట్టుకెళ్ళాలి.


  2. ఆవకాయ Says:
    October 1, 2010 7:47 AM

    ఆహా, వెతకబోయిన తీగ కాలికి దొరకడమంటే ఇదేనేమో. నేను నిన్నటి నుండీ శొధిస్తున్నా ఏమీ నానబెట్టక్కర్లేకుండా వేసే బీరకాయ అట్టుకోసం.మీరన్నట్లే బియ్యప్పిండీ కలిపి వెయ్యడం,అట్టు విరగడం కూడా అయ్యింది.

    ముక్కలు గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు పోసాను నేను.

    మీ పద్ధతి లో ట్రై చేస్తాను.స్టెప్ బై స్టెప్ పరిచయం చేసారు అట్టు ఎలా వెయ్యాలో.థాంక్యూ.


  3. sunita Says:
    October 1, 2010 8:05 AM

    మామూలుగా వంటలు చెప్పే సైట్లు (నలభీమ మినహాయించి) దాదాపుగా ఒకటే కంటెంటు తిరగా బొర్లా వేసి వుంటాయి అనిపిస్తుంది నాకు . కానీ మీ ఈ సైటు మాత్రం నాకు బాగా నచ్చింది. మీరు రాసేవన్నీ నాకు తెలియనివే.మొన్న అరటి దూట పెరుగు పచ్చడి చేసాను. మీ పాఠోళీ లాగా అమ్మ శెనగపిండితో పచ్చి మిరపకాయల కూర చేస్తుంది.రెండూ రుచిలో ఒకేలా ఉంటాయా అని అనుమానం. ఐనా అదీ ట్రై చేసి చూస్తాను. ఈ అట్టు కూడా చూచి మీకు చెబుతాను.కొత్త వంటలు నేర్పుతున్నందుకు మీకు తాంక్స్.


  4. Krishnapriya Says:
    October 1, 2010 11:50 AM

    Nice..


  5. మధురవాణి Says:
    October 1, 2010 2:18 PM

    నాది కూడా సునీత గారి మాటే! మీరు కొత్తరకమైన (మనం మిస్సయిపోతున్న పాతకాలం వంటలు) రెసిపీలు చెపుతున్నారు. Thanks a lot! ఈసారి బీరకాయలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను. :)


  6. ఆ.సౌమ్య Says:
    October 13, 2010 1:59 PM

    నా కామెంటు ఏదీ?
    నిన్న కామెంటు రాసాను, కనిపించట్లేదు?????????


  7. తృష్ణ Says:
    October 13, 2010 5:56 PM

    @ఆ.సౌమ్య: నిన్న కామెంటేమీ రాలేదండీ మరి..??


  8. పద్మ Says:
    November 1, 2010 11:47 AM

    బీరకాయ అట్టు ఈరోజు చేసానండి తృష్ణగారు. శెనగపిండి వేసి చేసాను. మొదట పిండి పల్చగా ఉండి అట్టు సరిగ్గా రాలేదు. దానితో కొంచెం గోధుమ పిండి కూడా కలిపి చేసాను. బ్రహ్మాండంగా వచ్చాయి. అన్నం, నెయ్యి, బీరకాయ అట్టు, దోసకాయ పచ్చడి కాంబినేషన్ బ్రహ్మాండం. ఇప్పుడింక నిద్ర వస్తుంటే ఆపుకుని ముందు కామెంట్ పోస్ట్ చేస్తున్నాను. :) థాంక్స్ ఫర్ సచ్ ఎ నైస్ రెసిపీ.


  9. తృష్ణ Says:
    November 1, 2010 11:26 PM

    @padma: Thatz great. Thank you too..:)


Post a Comment

« Newer Post Older Post »
Subscribe to: Post Comments (Atom)
"Health is Wealth."

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2012 (11)
    • ►  May (3)
      • ఆవకాయలు మాగాయలు - 2
      • ఆవకాయలు మాగాయలు - 1
      • పచ్చి బొప్పాయి(raw papaya) కూర
    • ►  April (1)
      • మావిడి పిందెలతో ఆవబద్దలు
    • ►  March (1)
      • ఆనపకాయతో చపాతీ/పూరీ కూర
    • ►  February (4)
      • కొబ్బరి + కంది పచ్చడి
      • నారింజకాయ కారం
      • ముల్లంగి చపాతీ
      • బ్రెడ్ ఉప్మా
    • ►  January (2)
      • అప్పాలు
      • వాంగీబాత్
  • ►  2011 (35)
    • ►  December (3)
      • పండుమిరమకాయ - చింతకాయ పచ్చడి
      • ఓట్స్ దోశ
      • (కాల్చిన)అరటికాయ పొడి కూర
    • ►  November (6)
      • ఆయిల్ ఫ్రీ పొంగడాలు
      • దబ్బకాయ ఊరగాయ
      • mixed vegetable "కూటు"
      • బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...
      • పనసపొట్టు ఆవకూర
      • అరటిపువ్వు పచ్చడి
    • ►  September (3)
      • వాక్కాయ-కొబ్బరికాయ పచ్చడి
      • కేబేజీ పకోడి
      • కొబ్బరన్నం with & without masala
    • ►  August (4)
      • Russian salad
      • బీట్రూట్ - ఆవ కూర
      • మిక్స్డ్ వెజిటెబుల్ ఆవకాయ
      • పచ్చి టమాటా తో ' మెంతిబద్దలు '
    • ►  June (2)
      • ములక్కాడ(drumstick) తియ్య కూర
      • పుదీనా రైస్
    • ►  May (4)
      • ఆంధ్రా pizza
      • One salad - Two dressings !!
      • Gujarati 'chundo'
      • my most favourite - ఉప్పుడుపిండి పులిహోర !
    • ►  April (6)
      • పేలాల వడియాలు
      • అరటిపువ్వు వడలు - no one can eat just one !
      • ఆదివారం పొద్దున్నే ఓట్స్ ఉప్మా !!
      • మెంతిబద్దలు
      • సోయా వడలు
      • కొత్తావకాయ, కందిపొడి, ముద్దపప్పు !!
    • ►  March (5)
      • పెసరఉండలతో మజ్జిగపులుసు
      • చారులు .. రకాలు..
      • ఇంట్లోనే "సాంబార్ పౌడర్" చేసుకోండిలా...
      • కాకరకాయ ఒరుగులు
      • stuffed capsicum
    • ►  February (2)
      • గోంగూర గ్రీన్ పచ్చడి
      • కందట్టు
  • ▼  2010 (14)
    • ►  December (6)
      • మెంతికూర-పనీర్ రైస్
      • స్పాంజ్/స్టీం దోశ
      • శీతాకాలంలో బూడిదగుమ్మడి వడియాలు + అట్టు ?!
      • కాలీఫ్లవర్ ఆవకాయ
    • ▼  September (4)
      • బీరకాయ అట్టు
      • బీరపొట్టు పప్పు
      • సగ్గుబియ్యం చేతి అట్టు
      • శనగలతో పాఠోళీ
    • ►  August (1)
    • ►  June (3)

About

My Photo
తృష్ణ
View my complete profile

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    "రజనీ ఆత్మకథా విభావరి" - రెండు మంచి ప్రసంగాలు
    2 days ago
  • సంగీతప్రియ
    "అప్పుడప్పుడు"
    3 days ago
  • మనోనేత్రం
    mobile photos
    2 weeks ago
  • సినిమా పేజీ
    "Children of Heaven"
    2 months ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys (1)
  • expetiments (2)
  • Kitchen Essentials (1)
  • pulses (1)
  • recipe links (1)
  • rotis (1)
  • salads (2)
  • snacks (5)
  • tiffins (2)
  • అట్లు - రకాలు (5)
  • ఊరగాయలు-రకాలు (7)
  • ఒడియాలు (3)
  • కూరలు (13)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (2)
  • పచ్చళ్ళు (7)
  • పప్పులు (2)
  • పులిహోర (1)
  • పులుసులు (1)
  • మన పిండివంటలు (1)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (4)

'రుచి' ఇష్టపడేవారు

కూడలి haaram logo మాలిక: Telugu Blogs
Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.