టిఫిన్స్ అన్నింటిలో రాజెవరూ అంటే నాకైతే దోశ. అయితే ఒకటే రకం కాదు ఏ రకమైనా సరే. రకరకాల దోశలు నేర్చుకుని ఎక్స్పరిమెంట్లు చేయటం నాకు సరదా. ఆ ప్రోసెస్ లో తెలుసుకున్న ఒక రకం ఈ స్పాంజ్ దోశ. దీన్నే "స్టీమ్ దోశ" అంటారేమో అని నాకో డౌట్.
ఈ స్పాంజ్ దోశ నేనెలా చేస్తానంటే:
* ఉప్పుడు బియ్యం - 1 glassఅటుకులు - 3/4 glass
* అటుకులు - 3/4
* మెంతులు - 1 small spoon
* కొద్దిగా నీటితోపాటూ చిలికిన పుల్ల మజ్జిగ - 2 glasses
* పైనవన్నీ కలిపి ఒక గిన్నెలో 6,7 గంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
* తరువాత ఇష్టం ఉంటే అర చెంచా వంటసోడా పిండికి కలిపి పెనంపై అట్టు వేసుకోవాలి. (నాకు ఇష్టం ఉండదు. కానీ వాడితే దోశ ఇంకా బాగా ఉబ్బుతుంది)
* అయితే, ఈ అట్టును కదపకూడదు. పెద్ద గరిటతో స్ప్రెడ్ అయ్యేలా వేసేసుకోవాలి. ఇలా..
అప్పుడూ పిండి క్రింద ఫోటోలోలా అవుతుంది.
* అప్పుడూ క్రింద ఫోటోలోలా ఏదైనా మూత పెట్టాలి.
*మధ్య మధ్య మూత తీసి చూస్తూ ఉండాలి. వేలికి పిండి అంటలేదు అన్పించాకా వెనక్కు తిప్పకుండా తీసేసుకోవటమే. ఇలా ఉంటుంది అది.
* దీన్ని మూత పెడతాము కాబట్టి, నూనె వాడము కాబట్టి స్టీం దోశ అంటే ఇదేనేమో అనీ, స్పాంజ్ లాగా బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో స్పాంజ్ దోశ అంటే కూడా ఇదే.
* కేరెట్, బీన్స్ లాంటి కూరముక్కలు వేస్తే వెజిటబుల్ స్టోం దోశ అయిపోతుందంతే :)
* నాన్ స్టిక్ పెనం కాకపోతే కాస్తంత నూనె వేసుకోవచ్చు.
పేరేదైతేనేం తినటానికి ఒక మంచి దోశ. నూనె అవసరం లేదు. చక్కగా ఏదైనా tomato కానీ నువ్వుల చెట్నీ లేదా కొబ్బరి పచ్చడితో తింటే సూపర్..!! (ఫోటోలో నేను చేసినది టమాటో,కొత్తిమీర కలిపి చేసిన చట్నీ)
దీన్నే సెట్ దోశ అని కూడా అంటారు. దీనికి చట్నీకంటే ఖుర్మా మంచి కాంబినేషన్..
please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.
బాగుంది తృష్ణగారు :-)
ఆ అటుకులతో చేసినదాన్ని మేము "చల్లట్లు" అంటాం...చాలా బావుంటుంది.
manchi recepie