ఇది నాకు చాలా ఇష్టమైన స్నాక్. మొదటిసారి నేనివి టేస్ట్ చేసినది బొంబాయిలో. ఆ తరువాత తినటం ఆపింది లేదు. భోజనంలో తనకు అప్పడాలు డీప్ ఫ్రై చేసి ఇచ్చినప్పుడల్లా నేను ఇవి తింటూంటాను. (నేను డీప్ ఫ్రైస్ తినను మరి. )
వీటిని గోధుమ పిండితో చేస్తారు. నూనె వాడరు. హెల్తీ స్నాక్స్ కాబట్టి అప్పడాలు, చిప్స్, భుజియా, జంతికల్లాంటి డీప్ ఫ్రైడ్ స్నేక్స్ లా భయపడుతూ కాకుండా హాయిగా తినొచ్చు.
ఖాఖ్రాల్లో రకాలు కూడా ఉంటాయి. methi khakhra, chilli garlic khakhra, masala khakhra etc. ఇది గుజరాతీ ఫుడ్ కాబట్టి మేము బొంబాయిలో ఉన్నప్పుడూ బ్రాండేడ్ కంపెనీలవే కాక లోకల్ కంపెనీలవి చిన్న చిన్న షాపుల్లో కూడా చాలా దొరికేవి. అన్నిరకాలూ టేస్ట్ బాగుండేవి కూడా. కానీ ఆంధ్రాలోకి వచ్చాకా బ్రాండెడ్ కంపెనీలవే, అదికూడా కాస్త పెద్ద సూపర్మార్కెట్లలోనే ఇవి దొరుకుతున్నాయి.
నాకు methi ఇష్టం కాబట్టి నేనెప్పుడూ methi khakhra నే కొంటూంటాను. ఈసారే కొత్త వెరైటీ "చిల్లి గార్లిక్" కొన్నా. అంత కారం నేను తినలేను కానీ నోరు మండుతూ ఈ ఖాఖ్రాలు ఖారం ఖారంగా భలే ఉన్నాయి. ఒకోసారి ఇలా ఉస్...ఉస్..అనుకుంటూ నోరు మండేలా ఉన్నవి తింటుంటే కూడా భలే మజాగా ఉంటుంది. మీరూ హెల్త్ కాన్షియస్ + ఇవి ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే వెంఠనే కొనేయండి మరి. వీటిని అన్నంలోనే కాక సాయంత్రాలు టీ తో కూడా తినచ్చు.
Post a Comment