నిన్న తృష్ణ టపా చూసిన వారందరూ వచ్చేసినట్లేనా ? ఇదిగో మళ్ళీ నిన్నటి ఫోటో ఇక్కడ పెట్టేసా.. ముందుగా చిన్నమాట...
* పొద్దున్న వండిన పప్పు ఏమైనా మిగిలిందా ఇంట్లో..?
* క్రితం వారం వాడాకా మిగిలిన స్వీట్ కార్న్ గింజలేమన్నా మీ ఫ్రిజ్ లో ఉన్నాయా?
* shells లోనే మొలకెత్తేసి బయటకు కనిపిస్తున్న పచ్చి బఠాణీలు మమ్మల్నికనైనా వాడేసెయ్ వాడేసెయ్ అని దీనంగా చూస్తున్నాయా?
ఇవన్నీ ఉంటే వెంఠనే stuffed capsicum చేయటానికి మీరు అర్హులు...:)
ఒకప్పుడు శాస్త్రోక్తంగా పనీర్ కొనుక్కొచ్చి, గ్రేట్ చేసి ఈ కూర చేయటానికి వాడేదాన్ని. ఇప్పుడు మరి హెల్త్ కాన్షియస్ అయిపోయాకా పనీర్,బటర్ వాడకం మానేసాం కాబట్టి అవిలేకుండా ఎలా వండాలో ఎక్స్పరిమెంట్లు చేస్తున్నానన్నమాట. పొటాటో కూడా ఉడకబెట్టినదైతే పర్వాలేదు తినొచ్చని చాలా చోట్ల రాస్తున్నారు కాబట్టి అది అప్పుడప్పుడూ వాడుతూ ఉంటాను. పచ్చిబఠాణిలు ఇంకా దొరుకుతున్నాయి కాబట్టి అవి నానబెట్టక్కర్లేకుండా ఫ్రెష్ వే వాడేయచ్చు. ఇక నిజంగా తయారీలోకి వచ్చేస్తే, ఇక్కడ రాసేది పైన ఫోటోలో నేను చేసిన కూర విధానం మాత్రమే అని సవినయంగా మనవి చేస్తున్నాను.
తయారీ:
* ముందుగా కేప్సికం పైన ముచిక ఉన్న వైపు కట్ చేసి లోపల గింజలు పార్ట్ తీసేయాలి. అప్పుడవి cup లాగ ఉంటాయి. అలా కట్ చేసిన కేప్సికమ్స్ ని పావు వంతు మునిగేలా నీళ్ళు పోసి బుల్లి కుక్కర్ లో(నా దగ్గరున్నది 2 ltrs కుక్కర్ ) పెట్టి విజిల్ రాబోతోందనగా తీసేయాలి. అలా అయితే మరీ మెత్తగా అయిపోతాయని డౌట్ ఉంటే కడాయీలో కూడా నీళ్ళు పోసి, మూత పెట్టి, కాస్త మెత్తబడ్డాయి అనిపించాకా తీసేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త మెత్తబడ్డ కేప్సికం కప్స్ రెడి అయ్యాయి.
* ఒక ఒక పెద్ద బంగాళా దుంప లేక రెండు చిన్నవి తొక్కతీసేసి (బంగాళాదుంప మాత్రమే వండేప్పుడు తొక్క తీయకుండా ఉడకపెడితేనే పోషకాలు ఎక్కువ నిలుస్తాయి), చిన్న ముక్కలు తరిగి, వలిచిన పచ్చిబఠాణీలు(ఓ చిన్న టీ గ్లాసుడు) ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించాలి. దింపిన తరువాత మెత్తగా ముద్దలా చేసుకోవాలి. చేసుకోకపోయినా పర్వాలేదు...:)
* ఇప్పుడు, ఒక ఉల్లిపాయ, టమాటా ముక్కలు తరిగి మూకుడులో వేయించాలి. అవి వేగుతుంటే 1/2 టీగ్లాస్ స్వీట్ కార్న్(ఉంటేనే) గింజలు అందులో వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయనిపించాకా, ఇందాకా ఉడకపెట్టి ఉంచుకున్న పొటాటో, గ్రీన్ పీస్ ముద్ద అందులో వేసేయాలి. మీరిలా చెయ్యకండి కానీ నేనేమో ఇంట్లో పొద్దున్న వండిన ఆనపకాయ పప్పు ఉంటే అది బాగా మెత్తగా చేసేసి అది కూడా ఈ కర్రీ లో కలిపేసా.సాధారణంగా వేస్ట్ అయ్యేంత ఎక్కువ వండను కానీ పొద్దున్న వండిన పదార్ధాలు వేస్ట్ అవకుండా రాత్రికి రీమిక్స్ వంటలు చేయటంలో మన తర్వతే ఎవరన్నా...:)
* అప్పుడు ఈ కూరలో అర చెంచా ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా పొడి, పావు చెంచా పసుపు, ఒక చెంచా కారం వేసి కూరంతా బాగా కలిపి అయిదు నిమిషాల తరువాత దింపేసుకోవాలి.
* ఈ కూరను ముందుగా మెత్తబరుచుకుని ఉంచుకున్న కేప్సికంస్ లోకి కూరాలి. పై ఫోటోలో లాగ. ఏదైనా మూకుడులో కాని నాన్స్టిక్ pan లో కానీ 2,3చెంచాల నూనె వేసి అందులో ఈ stuffed capsicums చక్కగా పట్టేలా సెట్ చేయాలి.
*కదలటానికి స్పేస్ లేకుండా ఉండే చిన్నపాటి మూకుడు/pan అయితే బాగుంటుంది. లేకపోతే కేప్సికంస్ పక్కకి ఒరిగిపోయి కూరంతా మిక్స్ అయిపోయే ప్రమాదం ఉండి.(ఓసారీ ఆ ప్రమాదము జరిగింది).
*ఓ ఐదు నిమిషాలు ఏదైనా మూత పెట్టి మాడకుండా చూస్కుంటూ దింపేసుకోవాలి.
* అందంగా కనబడటానికి పైన తరిగిన కొత్తిమీర, కాస్త తురిమిన కేరెట్ కోరు తో అలంకరించాలి.
*స్టఫ్ చేసాకా వండిన స్టఫింగ్ కూర ముద్ద ఇంకా ఉండిపోతే, ఓ అర గ్లాస్ మజ్జిగ/పెరుగు(డిఫరెంట్ టేస్ట్ కోసం) కలిపేసి మరోసారి పొయ్యిమీద వేడి చేసేసి అది కూడా సైడ్ డిష్ లాగ మరో బౌల్ లో సర్వ్ చేసేయచ్చు.
తినే పధ్ధతి:
* వీటిని అన్నంలో కానీ చపాతీ లోకి గాని తినొచ్చు.
* కేప్సికం టేస్ట్ నచ్చని వాళ్ళు పైన డొల్లంతా జాగ్రత్తగా ఒలిచి పక్కపెట్టేసి లోపల కూర హాయిగా తినేయచ్చు. అంత మాత్రానికి స్టఫ్డ్ కేప్సికం ఎందుకు? లోపలి కూరొకటీ విడిగా వండేయచ్చుకదా అని అడక్కూడదు మరి.
* ఏ కూరయినా సరే ఇష్టంగా తినేవాళ్ళు(నాలాంటివాళ్ళు) ఎదుటివాళ్ళు వలిచి పాడేసిన కేప్సికం డొల్లలు కూడా మన కంచంలోకి షిఫ్ట్ చేసేసుకుని హేపీగా తినేయచ్చు.
షరతు:
మరి మీరు స్టఫ్డ్ కేప్సికం వండుకున్నారో లేక లోపలి కూర మాత్రమే వండుతున్నారో మాత్రం నాకు చెప్పేయాలి.
"నిన్న తృష్ణ టపా చూసిన వారందరూ వచ్చేసినట్లేనా ?"
ప్రెజెంట్ మేడం
" పొద్దున్న వండిన పప్పు ఏమైనా మిగిలిందా ఇంట్లో..?
* క్రితం వారం వాడాకా మిగిలిన స్వీట్ కార్న్ గింజలేమన్నా మీ ఫ్రిజ్ లో ఉన్నాయా?
* shells లోనే మొలకెత్తేసి బయటకు కనిపిస్తున్న పచ్చి బఠాణీలు మమ్మల్నికనైనా వాడేసెయ్ వాడేసెయ్ అని దీనంగా చూస్తున్నాయా?
ఇవన్నీ ఉంటే వెంఠనే stuffed capsicum చేయటానికి మీరు అర్హులు...:)"
వామ్మో ఈ వంట చేయడానికి వారం నించీ ప్రిపేర్ అవాలా? :(
హహ్హ..బాగుంది మీ వంటకం.మంచి కలర్ఫుల్గా ఉంది.
రీమిక్సు వంటలు...మీరూ నా బాపతే అన్నమాట!
అన్నట్టు మొన్నొక రోజు ఈ రీమిక్సు వంటల గురించి సరదాగా బజ్జులో వ్రాస్తే పప్పు నాగరాజు గారి వాటిని వేటూరి వంటలంటామని చెప్పారు.
http://www.google.com/buzz/varudhinit/RCpf7SMAA6g
@శంకర్: అవేమీ లేకపోయినా ప్రయత్నించచ్చు అని రాసా కదండి.
మీరొక్కరే present..మిగిలిన అందరికీ absent వేసేస్తా...:)
ధన్యవాదాలు.
@సిరిసిరి మువ్వ: అక్కడ రాయలేదు కానీ ఇక్కడ రాస్తున్నానండి...బావుందండి బజ్. modern trend బావుందండి బజ్. అందరూ బ్లాగులు వదిలేసి బజ్జుల్లోనే ఉంటున్నట్లున్నారు...:)
మీరు రాసిన అట్ల పిండి రీమిక్స్ లు నేనూ చేస్తూంటాను. ఇక అన్నం మిగిలితే నేనూ పులిహోర కన్నా ఏదన్నా రైస్ చేయటానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. కేబేజీ రైస్, కేరెట్ రైస్, పుదీనా లేక కొత్తిమీర రైస్. లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా తయారయ్యాకా బాగుంటుంది.
ధన్యవాదాలు.
ఆప్సేంట్ వేయకండి నేనూ ప్రెజెంట్ :))
బాగుందండి ..ఈ సారి కాప్సికం కొన్నప్పుడు ట్రై చేస్తా.
@raadhika(naani): Thank you..:)
Yup, present here, process konchem kashtam ga vundi.
Idi anta hurri burri ga tele vayvaharam laa ledu.
@kumar:అదేం లేదండి. వివరంగా, చేసుకోవటానికి వీలుగా రాయాలని అలా రాసాను. చేస్తే చాలా సులువు. ఓసారి ట్రై చేసి చూడండి.
Thanks for coming..:)
హర్రే ! భలే చేసారే ! నేనైతే, Capsicum ఉడకపెట్టకుండా, స్టఫ్ఫింగ్ (మసాలా పొడి లేవీ కలపకుండా కేవలం బంగాళా దుంపలు, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి light gaa fry చేసినది) కుక్కి, నూనెలో మువ్వంకాయ లాగా పడేసి పొయ్యి సిం (simmer) లో పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతా. ఒక ముప్పావుగంట తరవాతా, కాప్సికం స్టఫ్ఫింగ్ తో పాటూ ఉడికి, అడుగున మాడుతుందనగా - ఒక లాంటి వాసన రాగానే పరిగెత్తుకుంటూ వెనక్కొచ్చి, వాట్ని రక్షిsతా. మా ఆయనకి చాలా ఇష్టం ఇది. కానీ నూనె ఎక్కువ అవుతుందని (కాప్సికం ఉడకడానికి కూడా టైం ఎక్కువ అవుతుందని) మానేసాను. ఈ కుక్కరు పద్ధతి సింపుల్ గా వుంది.
sujata:అవునండి.నూనె తక్కువ పడుతుంది + త్వరగా అయిపొతుందండి ఇలా ముందుగా కుక్కర్లో పెట్టడం వల్ల. కేప్సికంస్ మరీ మెత్తబడకుండా చూసుకుంటే చాలంతే.