రాగులని పిల్లల ఆహారంలో భాగం చేయాలంటే రాగిపిండిని పూరీల్లో కలపటం ఒక సులువైన పధ్ధతి. రాగుల్లో కేల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకి, ఎముకలు బలహీనపడే పెద్దవారికీ ఉపయోగకరం. రాగిపిండిలో గోధుమపిండిలో కన్నా ఎక్కువ పీచుపదార్థం ఉంటుంది. రాగులు శరీరాన్ని చల్లబరుస్తాయి కూడా.
రాగిపిండి చపాతి,దోశ ల్లోకి కూడా వడచ్చు. రాగిపిండితో జావ చేసి అది పాలలో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకోవచ్చు.
రాగి పూరీలు ఎలాగంటే:
*ఒక కప్పు గోధుమపిండి
*ఒక కప్పు రాగి పిండి(మార్కెట్లో దొరుకుతుంది)
*గుప్పెడు బొంబాయి రవ్వ(optional)
*పిండి కలపటానికి సరిపడా నీళ్ళు
*తగినంత ఉప్పు
* గోధుమపిండి, రాగిపిండి కలిపి, బొంబాయిరవ్వ, తగినంత ఉప్పు నీళ్లతో కలిపి పూరీపిండి కలుపుకోవాలి.
* పూరీపిండి కలిపేప్పుడు గుప్పెడు బొంబాయిరవ్వ కలిపితే బాగా పొంగుతాయి.
రాగిపిండి తో తయారు చేసే ఒక హెల్త్ డ్రింక్ వివరాలు ఇక్కడ:
http://trishnaventa.blogspot.in/2010/04/blog-post.html
రాగి ఉపయోగాలు ఇక్కడ:
http://www.lifemojo.com/lifestyle/health-benefits-of-ragi-finger-millet-103788519
http://articles.timesofindia.indiatimes.com/2012-05-10/diet/30260042_1_ragi-baby-food-south-india
Post a Comment