కావల్సినవి:
*మూడు బచ్చలాకు కట్టలు
*కాస్త చింతపండు(అర నిమ్మచెక్క అంత) నానబెట్టినది
*పోపులోకి : పావుచెంచా ఆవాలు, అర చెంచా మినపప్పు, కాస్త జీలకర్ర, చిటికెడు ఇంగువ, మూడు ఎండుమిరపకాయలు
* తగినంత ఉప్పు
* 2,3 tsp oil.
తయారీ:
* బచ్చలాకు వలిచి కడగాలి. కాడలు లేతగా ఉంటే వేయచ్చు కానీ ముదురుగా ఉంటే ఆకు ఒక్కటే వలవాలి.
* 2 tsp oil లో బచ్చలాకు + చిటికెడు పసుపు వేసి మాడకుండా కలుపుతూ వేయించాలి.
* తర్వాత 1tsp oil లో పైన చెప్పిన పోపు పదార్థాలతో పోపు వేయించుకోవాలి.
* మిక్సీలో నానబెట్టిన చింతపండు,ఎండుమిర్చి, వేయింఛి చల్లార్చిన బచ్చలాకు కలిపి మరీ మెత్తగా పేస్టా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
* బచ్చలాకు జిగురుగా ఉంటుంది కాబట్టి గ్రైండర్లో పేస్ట్ అయిపోతుందేమో అనుకుంటే రోట్లో తొక్కుకోవచ్చు కూడా.
* పచ్చడి చేసేప్పుడు పోపు కలిపేసే కన్నా, గిన్నెలోకి తీసాకా పోపు పైన వేసి కలుపుకుంటే బావుంటుంది.
* వేడి వేడి అన్నంతో తింటే ఈ పచ్చడి చాలా బావుంటుంది.
బచ్చలి ఉపయోగాలు ”కందబచ్చలి కూర’టపాలో చూడవచ్చు.
మా ఇంట్లో బచ్చలి మొక్కలున్నాయి కానీ ఇంతవరకూ వాటిని సరిగా ఉపయోగించలేదు ఎలా వండాలో కరెక్ట్ గా తెలియక..మీ పోస్ట్లు చూసి ట్రై చేసాను.పచ్చడి,కంద బచ్చలి రెండూ చేసాను.కంద మరీ మెత్తగా ఐపోయిందికానీ బాగానే కుదిరింది. థాంక్సండి
@రాధిక(నాని ):బచ్చలి ఆకులతో మజ్జిగపులుసు చేసుకోవచ్చండి.బావుంటుంది. బజ్జీలు కూడా వేసుకోవచ్చు.
ధన్యవాదాలు.
@swathi: oh..thank you for the tip.