పెసలు ఒక రాత్రంతా నానబెట్టి పొద్దున్నే నీరు వాడ్చేసి, తడిలేకుండా చూసి పొడి గిన్నెలో కానీ పొడిగా ఉన్న స్టీల్ బాక్స్ లో కానీ వేసి మూత పెట్టేస్తే రాత్రికల్లా చక్కగా మొలకెత్తుతాయి. పల్చటి గుడ్డలో మూట కడితే ఇంకా బాగా వస్తాయి కానీ పొడి గిన్నెలో పెట్టడం సులువుగా ఉంటుంది. అప్పుడు మొలకపెసలని ఫ్రిజ్ లో పెట్టేస్తే రెండుమూడు రోజులు వాడుకోవచ్చు. వారమైనా పాడవవు కానీ తాజాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నానబెట్టుకోవాలి.
మొలకెత్తిన పెసలతో పెసరట్టు, పుణుకులు, రైస్, సూప్ మొదలైనవి చేసుకోవచ్చు. నేనైతే ఉప్మాలో, అట్టు మీద, కూరల్లో కూడా వేస్తుంటాను. క్రింద రాసిన సలాడ్ సులువుగా ఎవరైనా చేసుకుని తినచ్చు. ఇది తింటే చాలాసేపు ఆకలి వెయ్యకుండా కూడా ఉంటుంది.
కావల్సినవి:
*3/4 cup మొలకెత్తిన పెసలు(పచ్చివి)
*one medium cup మరమరాలు(puffed rice)
* 1/2 cup చిన్నగా తరిగిన కీరా ముక్కలు
* చిన్నగా తరిగిన ఉల్లిపాయ(medium size) ముక్కలు
*half lemon juice
*తగినంత ఉప్పు, కారం
* పైన చల్లటానికి తరిగిన కొత్తిమీర
తయారీ:
* పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బౌల్ లో కలిపేసుకోవాలి.
* ఉప్పు,కారం వేసి కలిపాకా, నిమ్మరసం పిండుకుని, పైన కొత్తిమీర చల్లాలి.
* ఇందులో సన్నకారప్పూస కూడా చల్లుకుంటే ఇంకా బావుంటుంది.
* పైన చెప్పిన కొలతలు ఒక్కళ్ళు తినటానికి సరిపోతాయి :-)
బాగుందడి .పెసల మొలకలు గురించి నా పోస్ట్ కూడ చూడండి http://saisatyapriya.blogspot.in/
@రాధిక(నాని ) : మొలకల కోసం ఈ ఐడియా కూడా బావుందండీ.Thanks for sharing :)