జొన్నరవ్వఉప్మా-అరటి దూట పెరుగుపచ్చడి |
గోధుమల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన ఉపయోగాలు "చిరుధాన్యాలకు (millets)" ఉన్నాయి. అన్ని చిరుధాన్యాలలోకీ జొన్నలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. జొన్న రొట్టెలు, జొన్న పేలాలు చేసి వాటితో లడ్డులు, జొన్న సూప్ మొదలైనవి మనం చేసుకుంటూ ఉంటాము. గోధుమ రవ్వ లాగానే "జొన్న రవ్వ" బజార్లో దొరుకుతుంది. ఆ రవ్వతో ఉప్మా ఎలా ఉంటుందా అని ప్రయత్నించాను. బాగా వచ్చింది. మీరూ ప్రయత్నించి చూడండి...
కావాల్సినవి:
* ఒక కప్పు జొన్న రవ్వ (జొన్న రవ్వ దొరకకపోతే, జొన్నలు పొడి మూకుట్లో కాసేపు వేయించి బరగ్గా గ్రైండ్ చేసుకుని, జల్లించుకుంటే, జొన్న రవ్వ తయారవుతుంది)
* మూడు కప్పుల నీళ్ళు
* ఒక కేరెట్(తరిగినది)
* పది బీన్స్(తరిగినవి)
* ఒక ఉల్లిపాయ
* ఒక అంగుళం అల్లం ముక్క
* రెండు పచ్చిమిరపకాయలు
* ఒక ఎండు మిరపకాయ
* పోపు లోకి: ఒకటి రెండు చెంచాల నూనె, ఆవాలు,శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, కాస్త కర్వేపాకు
*తగినంత ఉప్పు
* పైన అలంకరించటానికి కాస్తంత కొత్తిమీర తరుగు
విధానం:
* ముందుగా చిన్న కుక్కర్లో పోపు వేయించుకుని, అందులో అల్లం,మిర్చి వేసాకా కూరముక్కలు కూడా వెయ్యాలి.
* తర్వాత అందులో జొన్నరవ్వ వేసేసి రెండు నిమిషాలు కలపాలి.
* తర్వాత నీళ్ళు పోసేసి, తగినంత ఉప్పు వేసి, కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చాకా ఆపేయటమే.
*జొన్నరవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది.
* పైన ఫోటోలో జొన్నరవ్వఉప్మాతో పాటూ పెట్టినది అరటి దూట పెరుగుపచ్చడి. కాంబినేషన్ బానే ఉంది. కారం తినేవాళ్ళు దీనికి సైడ్ డిష్ గా ఏదైనా పచ్చడి కూడా చేసుకోవచ్చు.
జొన్నలు గురించిన వివరాలు, ఉపయోగాలు ఇక్కడ చూడవచ్చు:
http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81
manchi vantakam
thanks sasikala gaaru.
మంచి వంటకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు