అప్పడాలు లేకుండా అన్నం తినరు మా ఇంట్లోవాళ్ళు ! రోజూ డీప్ ఫ్రైడ్ పాపడ్ అంటే నాకు చెయ్యటం ఇష్టం లేదు. మా చిన్నప్పుడు అమ్మ స్టౌ మీదే కాల్చేది అప్పడాలు. కానీ అలా చేస్తే నాకు సగం అప్పాడాలు మాడిపోయాయి. మైక్రోవేవ్ లో చక్కగా బాగా వస్తాయి. కానీ ఒక్క అప్పడాల కోసం మైక్రోవేవ్ కొనటం ఎందుకు? అనిపించి ఎలా ఎలా అని ఆలోచిస్తే.. ఈ ఐడియా వచ్చింది.. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇక్కడ రాస్తున్నాను..
ఫోటో లోది పుల్కాలు చేస్కుందుకు కొన్న చట్రం. దాని మీద అప్పడాలు పెట్టాలని ఐడియా వచ్చింది. మాడకుండా బాగా వచ్చాయి అప్పడాలు. దానికి హేండిల్ ఉంటుంది కాబట్టి వేడిని బట్టి పైకి కిందకీ హేండిల్ పట్టుకుని తిప్పచ్చు.
ఇప్పుడింక ఆయిల్ ఫ్రీ అప్పడాలు చక్కగా రోజూ కాలుస్తున్నా..:)