చూడటానికి అల్లం లాగానే ఉండే "మావిడల్లం"(Mango-Ginger) పసుపు జాతికి చెందిన దుంప. చలికాలంలో ఎక్కువగా దొరికే మావిడల్లం మామూలు రోజుల్లోఎక్కువ దొరకదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో. బెజవాడలో కూడా మాకు బాగా దొరికేది మావిడల్లం. బీట్రూట్, కేరెట్,పచ్చి మిరపకాయ, ముక్కలతో పాటు మావిడల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగి నిమ్మరసం,ఉప్పు కలిపి సలాడ్ లాగ చేసేది అమ్మ. బీట్రూట్ లేకుండా కేరెట్ తో కూడా కలిపి చేయచ్చు.
with beetroot & carrot |
with carrot |
అలాకాక అల్లం పచ్చడి చేసుకున్నట్లు పచ్చడి కూడా చేయవచ్చు. అది మరోసారెప్పుడైనా చెప్తాను. ఈసారి మావిడల్లంతో పులిహోర చెప్తాను. ఎలా ఉంటుందో అని రెండు మూడు సార్లు ప్రయత్నించాను. బాగా వచ్చింది. చెయ్యటం కూడా సులువే.
ఎలాగంటే:
* మామూలు పులిహోర పోపు(ఆవాలు,శనగపప్పు,మినపప్పు,కాస్త జీలకర్ర, కర్వేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, అరచెంచా ఇంగువ, వేరుశనగపప్పు, పసుపు) వేయించేసి స్టౌ ఆపేయాలి. అప్పుడు తురిమిన మావిడల్లం కోరు ఆ పోపులో వేసి కలపాలి. ఆ వేడి సరిపోతుంది. మావిడల్లం కోరు మరీ పచ్చిది కాకుండా మరి వేగిపొకుండా ఉండాలన్నమాట.
* మావిడల్లం తురుము ఎంత అంటే.. ఒక గ్లాసు అంటే సుమారు 150gms బియ్యానికి 50gms మావిడల్లం తురుముకోవాలి.
* ఇప్పుడు ఉడికి చల్లారిన అన్నంలో పోపు, సరిపడా ఉప్పు, అవసరమైతే మరికాస్త పసుపు వేసి కలిపేసాకా నిమ్మరసం పిండాలి.
* అంటే చింతపండు పులిహోరలో మాములు అల్లం తురుము వేసినట్లుగా, నిమ్మకాయపులిహోరలో మావిడల్లం తురుము కలపాలన్నమాట :)
* మరి చింతపండు పులిహోరలో మావిడల్లం తురుము కలిపితేనో...? నేను ట్రై చెయ్యలేదు. మీరు చేసాకా బాగుంటే చెప్పండి..:-)
అసలు మామిడల్లమే చాలా ఇంటెరెస్టంగ్ వస్తువు.నేనుకూడా నిమ్మరసంలో మామిడల్లం బద్దలు,చీల్చినపచ్చిమిరప ముక్కలు కారెట్ ముక్కలువేస్తూవుంటాను.ఈ చలికాలంలో వేడన్నంలో పప్పుతోపాటు వూరీవూరని ఈముక్కలు మంచి కాంబినేషన్!!!