సోయాబీన్ ఇడ్లీకి కావాల్సినవి:
ఒక గ్లాసు సోయాబీన్ గింజలు
రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ
తయారీ:
* మినపప్పు నానబెట్టినట్లు సోయాబీన్ గింజల్ని రాత్రి నానబెట్టుకోవాలి. పగలైతే గింజలు ఓ ఎనిమిది గంటలు నానేలా చూసుకోవాలి.
* ఇడ్లీ రవ్వ మూడు నాలుగు గంతలు నానితే చాలు.
* నానిన సోయాబీన్ గింజల్ని ఇడ్లీలకి మినపప్పు రుబ్బినట్లే మెత్తగా రుబ్బుకొవాలి.
* నానిన ఇడ్లీ రవ్వ గట్టిగా పిండుతూ రుబ్బిన సోయాబీన్ పిండిలో కలపాలి.
* మామూలు ఇడ్లీలు వేసినట్లే ఇడ్లీ ప్లేట్లలో సోయాబీన్ పిండి వేసి అవిరిపై ఉడికించుకోవటమే.
* పదిహేను ఇరవై నిమిషాల్లో మెత్తని ఇడ్లీలు రెడీ అవుతాయి.
* సోయాబీన్ ఇడ్లీలను టమాటో గానీ మరే ఇతర చెట్నీతో గానీ వడ్డించవచ్చు.
note:ఈ పిండి నిలవ ఉంచలేదు నేను. ఉండకపోవచ్చు కూడా.. కాబట్టి ఎప్పటికప్పుడు కాస్త చేసుకోవటమే మంచిదేమో.
***
వెజిటబుల్ ఇడ్లీ:
మామూలు మినప్పిండి ఇడ్లీలు ప్లేట్ లో వేసేప్పుడు అందులో కాసిని కేరెట్,బీన్స్ ముక్కలు చిన్న చిన్నగ తరిగి వెయ్యటమే..:)
అవి ఉడికాకా ఇలా ఉంటాయి..:-)
bagunnayandi
thanks radhika gaaru.
తృష్ణ గారు, ఈ మధ్య నేను కూడా సోయా తో ఇడ్లీలు చేసాను, బాగానే వచ్చాయి. అయితే నేను సోయాతో పాటు మినపప్పు కూడా వేసి రుబ్బి, రవ్వ కలిపాను.
ఇలా మినపప్పు లేకుండా సోయాతోనే ఇడ్లీలు వస్తాయని నాకు తెలియదు. ఇంకోసారి మీరు చెప్పిన విధానంగా చేస్తానండి.
@anrd: నేనూ అలా మినపప్పు కలిపి వేద్దాం అనుకుంటున్నానండి.. అయితే నేనూ ట్రై చేస్తా..
thanks for the visit :)