ఈ చలికాలంలో చిక్కుడు కాయలు బాగా వస్తాయి కదా. వాటితో రెండు కూరలు.. ఇవి చాలామంది చేసుకునేవే.. తెలియనివాళ్ళు ఉంటే చేసుకుంటారని రాస్తున్నా.
సింపుల్ చిక్కుడుకాయ కూర:
* చిక్కుడుకాయలు కడిగి, పురుగు లేకుండా వలిచి చూసుకుని మధ్యకి తుంపుకోవాలి.
* ఆ ముక్కల్ని చిన్న కుక్కర్లో కాస్త ఉప్పు వేసి ఉడికించాలి. ముక్కలెన్ని ఉంటాయో దానికి సగమ్ నీళ్ళు పోస్తే చాలు.
* ఒకే ఒక్క విజిల్ వచ్చాకా ఆపేయాలి. ఎక్కువ కూతలు వస్తే ముక్కలు పేస్ట్ అయి కూర ముద్దగా అయిపోతుంది.
* కడాయిలో ఒకటి,రెండు చెంచాల నూనె వేసి ఈ ముక్కలు అందులో వేసేసి, ఐదు నిమిషాల తర్వాత కాస్త ఉప్పు, కారం(వెల్లుల్లి ఉన్న 'మసాల కారం' అయితే బావుంటుంది) చల్లి దింపేసుకోవటమే. పోపు కూడా అక్కర్లేదు.
* ఈ కూర అన్నంలోకీ, చపాతీల్లోకీ కూడా చాలా చాలా బావుంటుంది.
వంకాయ-చిక్కుడుకాయ:
* వంకాయ, చిక్కుడికాయ రెండు సమానంగా తీసుకోవాలి.
* తెల్లవంకాయలు అయినా పర్వాలేదు, పొడుగు వంకాయలైనా పర్వలేదు.
* పావుకేజి కూరకి చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి, ఆ రసం + తగినంత ఉప్పు, చిటికెడు పసుపు కూరముక్కల్లో వేసి ఉడకబెట్టాలి. (గిన్నెడుముక్కలు ఉంటే వాటికి మూడు వంతులు నీరు పొయాలి).
* కుక్కర్లో పెడితే రెండు, మూడు విజిల్స్ రావచ్చు.
* ఈ కూరకి ఉడికించే ముక్కలు పై ఫోటొలో లాగ పొడిపొడిగా ఉండచ్చు, లేదా ఎక్కువ నీళ్ళు పోసి కాస్త ముద్దగా కూడా ఉడకపెట్టుకోవచ్చు.
* రెండు అంగుళాలు అల్లం ముక్క, మూడు పచ్చిమిరపకాయలు తొక్కి ఉంచాలి. గ్రైండ్ చేసేకన్నా తొక్కితేనే బావుంటుంది.. మధ్య మధ్య అల్లం ముక్కలు తగులుతూ :)
* ఆవాలు,మినపప్పు, శనగపప్పు, కర్వేపాకు పోపు వేసి వేగాకా ఇందాకా తొక్కుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి రెండు నిమిషాలయ్యాక ఉడికిన కూర ముక్కలు ఇందులో వేసి కూర బాగా దగ్గర పడ్డాకా ఆపేయటమే.
* కూర పోపు పెట్టాకా తీసిన ఫోటో ఎంత వెతికినా కనబడలేదు..:(
కూర తయారయ్యాక ఫోటో మేము పంపుతాము లెండి
@R satyakiran: ok ok.. :-)