అసలు నాకూ చిన్నప్పటి నుండీ ఒక డౌటు.. హోటల్లొ కూడా మసాలా దోశలో మసాలా ఏమీ ఉండదు కదా..మరి దాన్ని మసాలా దోశ అని ఎందుకు అంటారు? అని !
అమ్మా "మసాలా దోశ " కావాలి అని పిల్ల రోజూ అడుగుతోంది.. ఇడ్లీ పిండి అయ్యాకా చేస్తాలే అని చెప్పా. నిన్న రాత్రి పప్పు నానబెట్టి ఇవాళ వేసిపెట్టా. ఈసారి మామూలుబియ్యం లేదా దంపుడు బియ్యం కాకుండా ఉప్పుడు బియ్యం నానబెట్టా.
ఈ దోశ కి కావాల్సినవి:
* గ్లాసుంపావు మినపప్పు ,
* రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం,
* అర గ్లాసు ఓట్స్,
* చెంచాడు శనగపప్పు లేదా చెంచాడు మెంతులు
(దోశ క్రిస్ప్ గా కావాలంటే శనగపప్పు, మెత్తగా కావాలంటే మెంతులు వేసుకోవాలి)
* పైన చెప్పిన ఐటెమ్స్ అన్నీ ముందురోజు రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అట్లు వేసుకోవటమే.
కూరకి: బఠాణీ, కేరెట్, బంగాళాదుంప ఉడకపెట్టి, పోపులో ఉల్లిపాయ వేసి వేగాకా, ఉడికిన కూరముక్కలు వేసి బాగా కలిపేసుకుంటే కూర రెడి అవుతుంది.
అది అట్టు మీద ఇలా వేసి తినిపెట్టమని ఇంట్లోవాళ్లకి ఇచ్చేయటమే :-)
If you have used a non-stick pan, it is not authentic. Here in U S we use iron/cast iron or stainless steel pans. I would like to know your opinions.
thanks.
@Andhraman:నాన్స్టిక్ పాన్ గీతలు పడకుండా బాగున్నంతవరకూ పర్వాలేదని విన్నానండి. ఇనుప పెనం లాగ బాగా హీట్ చేయకూడదు నాన్స్టిక్ తవా ని. బాగా హీట్ చేస్తేనే ప్రమాదం అంటారు. పొయ్యి తక్కువ హీట్ పెట్టుకుని, "ఆయిల్ లేకుండా" అట్లు వేయటానికి నాన్స్టిక్ అయితేనే బెటర్ అని నా ఉద్దేశం అండి. ఒక్క ఏడాది కన్నా ఎక్కువ ఏ నాన్స్టిక్ వస్తువూ నేను వాడను. నాన్స్టిక్ పేన్, కడాయీ రెండూ కూడా ప్రతి ఏడాది ఎక్స్చేంజ్ లో మార్చేస్తూంటానండి. సేఫ్టీ కోసం.పాతది ఇచ్చేస్తే కొత్తదాని మీద 25%,30% డిస్కౌంట్ వస్తుంది.
ఇనుప పెనం కూడా ఉందండి నా దగ్గర. దాని మీద చపాతీలు వేస్తాను. ఈ హడావూడి రోజుల్లో త్వరత్వరగా దోశలు, అట్లు వేయటానికి, నూనె లేకుండా అట్లు తినటానికీ నాన్స్టిక్ తవా బెటర్ అని నా అభిప్రాయం. అది గీతలు పడకుండా ఉన్నంతవరకూ.
మీ స్పందనకి ధన్యవాదాలు.