"అంతా mango మయం... మార్చంతా mango మయం..." అని పాడుకునేదాన్ని ఒకప్పుడు.. కొన్నేళ్ల పాటు! పచ్చి మామిడికాయలు మార్కెట్లో కనబడ్డం ఆలస్యం.. మా అత్తగారు అలా కొంటూనే ఉండేవారు సీజన్ అయ్యేదాకా. సీజన్ లో పచ్చిమామిడి కాయలు వస్తూంటే మా అమ్మ ఆవబద్దలు, మెంతి బద్దలు మాత్రం వేసేది. నేనేమో పచ్చి మామిడి జ్యూస్ , చుండో చేసేదాన్ని. ఇంకా పచ్చిమామిడి పులుసు మా అన్నయ్య బాగా చెస్తాడు. నే చెయ్యలేదెప్పుడు...తినేవాళ్ళు లేక :(
కానీ మా అత్తగారు మాత్రం వారంలో నాల్రోజులు మామిడివంటలే చేసేవారు. కొబ్బరికాయ - మామిడికాయ పచ్చడి ఆవిడకి ప్రాణం. ఇంకా మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, ఆవబద్దలు, మెంతి బద్దలు ఇలా రకరకాల వంటకాలు చేసేసేవారు. ఇంట్లో అందరూ ఇష్టంగా తినేసేవారు కూడా. ఆ రకంగా నాక్కూడా సీజన్ రాగానే పచ్చిమామిడికాయలు కొని ఈ ఐటెంస్ అన్నీ చెయ్యడం అసంకల్పితంగా వచ్చేసింది..:) ఈ నెల్లో చేసిన పచ్చిమామిడి వంటలు...
మామిడి పిండెలతో ఆవబద్దలు:
http://ruchi-thetemptation.blogspot.in/2012/04/blog-post.html
మెంతి బద్దలు:
రెసిపిలతో కాకుండా ఈ రెసిపీ విడిగా ఇదివరకూ రాసాను :)
http://ruchi-thetemptation.blogspot.in/2011/04/blog-post_10.html
మామిడికాయ పప్పు:
పప్పు రెసిపీ రాసేదేముంది..
* ముక్కలు పప్పు కలిపి కుక్కర్లో ఉడికించాకా,
* ఆవాలు,మినపప్పు,జీలకర్ర,వెల్లుల్లుపాయలు, కర్వేపాకు,ఎండుమిరపకాయలు,పసుపు,ఇంగువ లతో చక్కని పోపు వేసుకోవడమే.
మామిడికోరు పులిహోర:
* 250gm రైస్ తో అన్నం వండాలి.
* మీడియం సైజ్ మామిడికాయ ఇలా కోరుకోవాలి.
* తర్వాత మామూలు పులిహోరకు వేయించుకున్నట్లే పోపు వేయించుకోవాలి.
* అదనంగా ఐదారు జీడిపప్పు పలుకులు, రెండు అంగుళాలు అల్లంముక్క కోరి పోపులో వేస్తే అదనపు రుచి!
మామిడికోరు పులిహోర |
* మామిడి ముక్కలు ఎక్కువైపోతే పుల్లగా బావుండదు పచ్చడి. కాబట్టి కాయ పులుపుని బట్టి మామిడి ముక్కలు తక్కువగా వేసుకోవాలి.
* అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటూంటే ఉంటుందీ.... సూపరంతే!
*** *** ****
ఆవకాయలు మాగాయలు రకాలు, రెసిపీలు ఆ లింక్స్ లో..!