'అడై' తమిళనాట బాగా ఫేమస్సు! ఊతప్పం లాగనే 'అడై' కూడా కాస్త మందంగా ఉంటుంది కానీ అడై పిండితో దోశ కూడా వేయచ్చు. మందంగా కాకుండా మామూలు దోశలా ఉండి. టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
కావాల్సినవి:
మామూలు బియ్యం లేదా ఉప్పుడు బియ్యం: 11/2 cup
మినపప్పు :1/2 cup (వెయ్యకపోయినా పర్లేదు. ఇది నా సొంత ఆప్షన్ :))
పెసరపప్పు: 1/2 cup
శనగపప్పు: 1/2 cup
కందిపప్పు: 1/2 cup
రెండు మూడు ఎండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు
పావు చెంచా ఇంగువ
అర చెంచా మెంతులు
రెండు కేరెట్లు: తురిమినవి
రెండు ఉల్లిపాయలు: సన్నగా తరిగినవి
అంగుళం అల్లం ముక్క
చిన్న కట్ట కొత్తిమీర
తయారీ:
* ముందుగా బియ్యం, పప్పులన్నీ + మెంతులు ఓమాటు కడిగి, రెండు మూడు గంటలు నానబెట్టాలి.
* నానిన పప్పులన్నీ మెత్తగా రుబ్బుకోవాలి.
* ఎండుమిర్చి వేయాలంటే పప్పులతో పాటే నానబెట్టేసి రుబ్బేయాలి. పచ్చిమిరపకాయలైతే డైరెక్ట్ గా నానిన పప్పులతో కలిపి రుబ్బచ్చు. (నేను పచ్చిమిరపకాయలు వేసాను)
* రుబ్బిన పిండిలో ఉప్పు , ఇంగువ, కేరెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.
* పెనం కాలాకా దోశలాగ వేసి బాగా కాలనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. మామూలు దోశ కన్నా కాస్త ఎక్కువ సేపు కాలాలి ఇది. అడై దోశ ఎంత రో్స్ట్ అయితే అంత రుచి. బటర్ తో కాలిస్తే ఇంకా రుచిగా ఉంటాయి ఈ దోశలు :)
* ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసి ఊతప్పం లాగ మందంగా వేసుకోవచ్చు. ఇలా..
* ఉల్లిపాయ ముక్కలు కేరెట్ కోరులాగ దోశ పిండిలో కలపేయకుండా దోశ వేసాకా పైన చల్లాలి. అలా అయితే దోశ సన్నగా వస్తుంది. ఉల్లిపాయముక్కలు వేసేస్తే పిండి రౌండ్ గా స్ప్రెడ్ చేసేప్పుడు అవి ఆడ్డం వచ్చేస్తాయి.
* ఇందులోకి అల్లం, కొబ్బరి, పచ్చిటమాటా మొదలైన చట్నీలు బావుంటాయి. పైన ఫోటోలోది పల్లీలు+కొత్తిమీర కలిపి చేసిన చట్నీ.
pachi tomato recipe chepthara thrishna garu..
@సృజన గారూ, పచ్చిటమాటా కొద్దిగా వేయించి, కాసిని పల్లీలు విడిగా(పొడిగా) వేయించి, కాస్త చింతపండు కలిపి చట్నీ చే్యాలండీ. ఇదివరకూ రాసి ఉంచిన రెసిపీ ఉంది.. రేపు కాస్త ఖాళీ దొరికాక పెడతానండి..
ధన్యవాదాలు.
దోశ చూస్తుంటేనే నోరూరుతోంది తృష్ణ.
లాభం లేదు, ఈ వారాంతంలోగా ఏదో ఒక దోశ, వండుకునో, హోటల్ మీద పడో తిని తీరాలని ఇప్పుడే కంకణం కట్టుకుంటున్నా:)
దోశ బాగా వచ్చింది. ఊతప్పం చెయ్యాలి. థాంక్స్.
@సృజన గారూ, రెసిపీ రాసా చూడండి..
http://ruchi-thetemptation.blogspot.in/2014/03/blog-post_14.html
@jyothi gaarU, :-)
thank you.
@Rao S Lakkaraju:ఊతప్పం మీరు చేస్తారా? నన్ను చెయ్యమంటున్నారా?
thanks for the visit :)
Nenukoodaa Ada chestaamu.picture is very tempting.
కాసిని టొమాటో ముక్కలు,కాసిని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చి మెరపకాయ ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం కోతిమెర ముక్కలు,దోశ చేసేటప్పుడు మీద వేస్తే అదే ఊతప్పం అవుతుంది క దా అనుకుంటున్నాను. వేరుగా ఉంటె చెప్పండి. ఊతప్పము అయితే రెండిటితో కడుపు నిండుతుంది.
@Ram S Lakkaraju: అంతేనండి. ఇడ్లీ పిండీ or దోశ పిండిని కాస్త మందంగా పెనం మీద వేసి పైన ఉల్లి,టమాటా మొదలైన అలంకారాలన్నీ చేస్తే అదే ఊతప్పం..నాకు తెలిసీ! ఈ టపాలో ఇడ్లీ పిండితో చేసిన ఫోటో పెట్టా చూడండి..
http://ruchi-thetemptation.blogspot.in/2011/05/pizza.html
thanq trishna garu chusanu..chesanu chala baga vachindi ..adai dosa kuda chesanu super ga undi..thanq for ur recipes ..mee recipes chusi chala nerchukunna andi..Thanq so much..
@srujana: very happy to know that. Thank you too :)