చిలకడ దుంపలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి6; ఐరన్, మెగ్నీషియం మొదలైన మినరల్స్ ఉంటాయి. మిగతా దుంప కూరల్లో కన్నా వీటిల్లో పీచుపదార్థం ఎక్కువ. బరువు పెంచదు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఎదిగే పిల్లలకు ఎముకలు, పళ్ళు బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుందిట. అందుకని వారంలో ఒకసారైనా ఈ దుంపలను ఆహారంలో చేర్చుకోగలిగితే మంచిది.
చిలకడ దుంపలతో కూర, పచ్చడి, పులుసు కాక స్వీట్ కూడా చేసుకోవచ్చు. మా అత్తగారు చిలకడ దుంపలను ఉడకబెట్టి పాకంలో వేసేవారు. నేను ఆ రెసిపీని కాస్త మార్చి ఇలా తయారు చేస్తూంటాను.. ఎలాగంటే:
కావాల్సినవి:
* పావుకేజీ చిలకడ దుంపలు
* 100 or 150గ్రాముల బెల్లం
(తియ్యని దుంప కాబట్టి ఎక్కువ బెల్లం అక్కర్లేదు)
* అర కప్పు పాలు
* చిటికెడు కుంకుమపువ్వు
* చిటికెడు ఉప్పు
* రెండు చెంచాల నెయ్యి
చిలకడ దుంప స్వీట్ తయారీ:
* చిలకడ దుంపలను బాగా కడిగి తొక్క తీసి, గుండ్రంగా తరిగి ఉడకబెట్టాలి. (బంగాళాదుంప లాగ ఉడకబెట్టాకా తొక్క తీసి ముక్కలు చేయచ్చు).
* అయితే కుక్కర్లో ఒక్క విజిల్ రాగానే ఆపేయాలి. మరీ పేస్ట్ అయిపోతే బావుండదు.
* అరకప్పు గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వు వేసి ఉంచాలి.
* బెల్లం తురుముకుని, ముకుడులో కప్పుడు నీళ్లలో కరిగించి, కాస్త పాకం వచ్చేదాకా కలపాలి.
* అందులో ఉడికిన చిలకడదుంప ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి.(పేస్ట్ అవ్వకుండా చూడాలి).
* ముక్క తీయ్యబడ్డాకా, కుంకుమపువ్వు వేసిన పాలు,నెయ్యి అందులో పోసి అడుగంటకుండా కలపాలి.

* మొత్తం బాగా దగ్గరపడ్డాకా స్టౌ ఆపేయడమే.
* ఈ స్వీట్ చల్లారాకా కన్నా వేడివేడిగా తింటేనే రుచి!
* ఈ స్వీట్ చల్లారాకా కన్నా వేడివేడిగా తింటేనే రుచి!
Post a Comment