కాలీఫ్లవర్ పువ్వు పై భాగం కూరకి తరిగాకా, మిగిలే కాడలతో పచ్చడి చేయచ్చు.
కావాల్సినవి:
* ఒక కప్పు కాలీఫ్లవర్ కాడలు
* రెండు ఎండుమిర్చి, ఒక పచ్చిమిరపకాయ
* చెంచాడు చింతపండు(చిన్న నిమ్మకాయలో సగం అన్నమాట)
* తగినంత ఉప్పు
* కాస్త కొత్తిమీర (పై ఫోటొలో పచ్చడిలో కొత్తిమీర వెయ్యలేదు :))
* చిటికెడు పసుపు
పోపుకి: మినపప్పు,ఆవాలు,జీలకర్ర, కర్వేపాకు,ఇంగువ,
తయారీ:
* కాలీఫ్లవర్ కాడలు ఒక చెంచాడు నూనెలో కాస్తంత వేయించాలి.
* వేగిన ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, చింతపండు, కాలీఫ్లవర్ కాడలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు కలిపి మిక్సీలో తిప్పాలి.
* పచ్చడి మిక్సీ లోంచి తీశాకా పోపు కలుపుకోవాలి.
* ఈ పచ్చడి దోశల్లో, ఇడ్లీల్లో లేదా అన్నంలో కలుపుకుని తినచ్చు.
Post a Comment