ఇదివరకూ పచ్చి టమాటా తో మెంతి బద్దలు పెట్టుకోవడం రాసా కదా.. ఇప్పుడు పచ్చి టమాటా చట్నీ ఎలానో చూద్దాం! పండుటమాటాలు పచ్చడి చేసుకున్నట్లు సేమ్ ప్రొసీజర్ లో అన్నంలోకి పచ్చడి చేసుకోవచ్చు. (చింతపండు అక్కర్లేదు)
అలా కాకుండా టిఫిన్స్ లోకి కాసిని పల్లీలు వేసి చట్నీ చేసుకుంటే చాలా బావుంటుంది.
ఎలాగంటే..
* పావుకేజీ పచ్చి టమాటాలు కడిగి, ముక్కలు చేసి రెండు చిన్న చెంచాల నూనెలో వేయించాలి. మూకుడు పైన మూత పెడితే ముక్కలు త్వరగా మగ్గుతాయి.
* తర్వాత 50gms 0r 100gms పల్లిలు పొడిగా వేయించుకుని పొట్టు తీసేయాలి. (పల్లీ పచ్చడికి పొట్టు తీసేస్తాం కదా..అలాగ!)
* అర చెంచా ఆవాలు, చెంచా మినపప్పు, అర చెంచా జీలకర్ర, కర్వేపాకు, చిటికెడు పసుపు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ వేసి పోపు వేయించాలి. చివరలో చిన్న కట్ట కొత్తిమీర కడిగి అది కూడా పోపులో వేసేసి స్టౌ ఆపేయాలి. కొత్తిమీర వేగక్కర్లేదు. వేడికి ఆకులు మగ్గితే చాలు.
* ముందు ఓసారి పల్లీలు పొడి అయ్యేలా మిక్సీలో తిప్పేసుకోవాలి.
* తర్వాత వేగిన పచ్చిటమాటా ముక్కలు, పోపులో వేగిన మిరపకాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు అందులోనే వేసి చెట్నీ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
* ఈ చట్నీ ఇడ్లీల్లోకీ, అన్నిరకాల దోశల్లోకీ బాగుంటుంది.
Trishna Gaaru,
In general, I don't show much interest in recipe blogs or websites but I like yours because all your recipe's sound home made, traditional and not fancier.
For this chutney sometimes I add roasted sesame seeds instead of peanuts.It tastes so good.
I liked your chaaru recipies's and I do most of them. I also wanted to share a recipie for chaaru, you might already know this.
It is raw mango chaaru, place one sour raw mango in kumpati or pressure cook with out water. once mango is cooked take the pulp out (throw out skin and seed) add desired amount of water depending on the sourness and salt. Then do thadka/ thalimpu ( chaaru thalimpu with curry leaves and coriander).
most of them will add finely cut raw onions too. I personally do not like onions. You can also add little jiggery if you have sweet teeeth. This is almost a routine chaaru at our home during summer.
Instead of adding salt and thalimpu if you add sugar and ice it becomes cool drink in summer.
Surabhi
@Surabhi:సురభి గారూ, మీ వ్యాఖ్య చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. (మొన్న 'సంగీతప్రియ' blogలో కూడా!) ఇలాంటి ఒక్క రీడర్ ఉన్నా ఉత్సాహంగా బ్లాగ్ రాయాలని అనిపిస్తుందండి! మీరు చెప్పిన మామిడి చారు కూడా బావుంది. వేసవిలో నేను జ్యూస్ చేస్తానండి పచ్చిమామిడితో. క్రిందటేడు "వేసవి పానీయాలు" అని రాసిన సిరీస్ లో దాని గురించి రాసా చూడండి..
http://ruchi-thetemptation.blogspot.in/2013/04/5.html
Chala bagundandi mee blog and receipes !!
thanks for the visit sruthi gaaru.