నానిన సబ్జా గింజలు |
వేసవిలో ఒంట్లో పెరిగే వేడిని తగ్గించుకుందుకు చాలా రకాల పానీయాలు ఉన్నాయి. వాటిల్లో నాకు తెలిసిన కొన్నింటిని ఈ సిరీస్ లో రాయాలని సంకల్పం. మా ఇంట్లో చిన్నప్పటి నుండీ వాడుతున్న కొన్నింటి గురించి రాస్తాను. ఎవరైనా తెలీనివాళ్ళకి ఉపయోగపడతాయి.
మొదటిగా సబ్జా గింజల గురించి...
సబ్జా గింజల్ని ఆంగ్లంలో "బేసిల్ సీడ్స్" అంటారు. బేసిల్ తులసి మొక్కలాంటిదే. ఒకటే జాతి. ఆకులు వేరుగా ఉంటాయి. వీటి గింజలను రకరకాలుగా వాడతారు. కూల్డ్రింక్స్ లో, ఐస్క్రీంస్ లో, "ఫలూదా" అనే ప్రఖ్యాత డ్రింక్ లో.. ఇలాగన్నమాట. సబ్జా గింజల ముఖ్య గుణం శరీరంలో వేడిని తగ్గించటం. బజార్లో చాలా చోట్ల తక్కువ ధరలో ఈ గింజలు మనకు లభ్యమౌతాయి.
సబ్జా గింజల నీరు + జూస్ :
* ఒక చెంచా సబ్జా గింజలను ఒక పెద్దగ్లాసుడు నీళ్ళలో(200 ml) వేసి ఓ మూడు గంటలు వదిలేయాలి. తరువాత ఆ నీటిని వడబోసుకుని తాగటమే. నానిన గింజలను కాసిని తినవచ్చు కూడా. కావాలంటే పంచదార వేసుకుని మరీ తినచ్చు. ఖస్ ఖస్ మంటూ సరదాగా భలే ఉంటాయి నమలటానికి :-)
*రాత్రి నానబెట్టి పొద్దున్నే వడబోసుకుని ఆ నీళ్ళు తాగచ్చు కూడా.
* ఈ సబ్జా గింజల నీటిని కొబ్బరి నీళ్లలో కలుపుకుని తాగవచ్చు.
* పుచ్చకాయ ముక్కలతో గానీ వేరే ఏదైన ఫ్రూట్ జ్యూస్ చేసేప్పుడు ఈ నీటిని అందులో కలిపి తాగవచ్చు.
* వీటివల్ల మిగతా ఉపయోగాలు ఎలా ఉన్నా, వేసవిలో శరీరాన్ని చల్లబరచటానికి, అన్నికాలాల్లోనూ వేడి శరీరాలు గలవారికీ సబ్జా గింజలు నానబెట్టిన నీరు చాలా మేలు చేస్తుంది.
వేసవిలో ఊళ్ళల్లో బజార్లో కూల్డ్రింక్స్ అమ్మే బండి లో కూల్డ్రింక్ లో కలిపి అమ్మే వాళ్ళు. ఇప్పుడు ఆ బళ్ళు ఉన్నయ్యో లేదో తెలియదు.
@Rao S Lakkaraju: అలాంటి బళ్లవాళ్ళే "ఫలూదా" అనే డ్రింక్ తయారు చేస్తారండి. అందులో నానబెట్టిన సబ్జా గింజలు వేస్తారు. ఫలూదా బొంబాయిలో బాగా ఫేమస్.
ధన్యవాదాలు.
Thankyou :)
చిన్నప్పుడు బాగా తాగేవాడ్ని
హిందీ లో వీటిని ఏమంటారు ట్రై చేస్తాను :)
@hare krishna: got this -
"Tukmaria (in Hindi) is the seed of the Sweet Basil plant also known as St. John’s wort in European countries. It is not the same as Holy basil or Tulsi, though it looks similar. And, they are sold under many a names like sabja, subja, tukmaria, takmaria and falooda seeds"
In english ..call it as Chia seeds.
@chinniii: oh..thank you.