మజ్జిగ బాగా చిలికి లేదా గ్రైండ్ చేసి అందులో బాగా నీళ్ళు పోసి(ఒకవంతు మజ్జిగ, మూడొంతులు నీళ్ళూ) పల్చని మజ్జిగ చేసుకుని అట్టేపెట్టాకా, పైకి తేరిన నీటిని మజ్జిగ తేట అంటాం కదా. వేసవిలో ఆరారా ఈ 'మజ్జిగ తేట' తాగటం అందరం చేస్తూంటాం. ఎండలో బయటకు వెళ్ళే ముందు ఈ మజ్జిగ తేట తాగి వెళితే మంచిది. ఈ మజ్జిగ తేట లో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు లతో పాటూ ఫ్లేవర్ కోసం రకరకాల 'ఆకులు' కూడా కలుపుకు ఉంచితే మంచి సువాసనతో తగటానికి బావుంటుంది.
* దబ్బాకులు:

* నిమ్మ ఆకులు:
దబ్బచెట్టు ఆకులు దొరకకపోతే నిమ్మ చెట్టు ఆకులు అయినా తుంపి మజ్జిగలో వేసుకుని, మర్నాడు తాగచ్చు.
ఇలా దబ్బాకులు గాని నిమ్మ ఆకులు గాని వేసిన మజ్జిగ రెండు రోజులకన్నా ఉంచితే ఆ ఫ్రెష్ ఫ్లేవర్ పోతుంది.
* కర్వేపాకు:
మజ్జిగలో నీళ్ళు, ఉప్పు, కర్వేపాకు, అల్లం, చిన్న పచ్చిమిర్చి ముక్క వేసి గ్రైండ్ చేసుకుని మసాలా మజ్జిగ అని మా అమ్మ ఇస్తూండేది :)
మజ్జిగలో నీళ్ళు, ఉప్పు, కర్వేపాకు, అల్లం, చిన్న పచ్చిమిర్చి ముక్క వేసి గ్రైండ్ చేసుకుని మసాలా మజ్జిగ అని మా అమ్మ ఇస్తూండేది :)
* కొత్తిమీర:

కర్వేపాకు బదులు కొత్తిమీర ఆకులు వేసి పైన చెప్పినట్లే మజ్జిగ గ్రైండ్ చేసుకోవాలి. రెండిటిలోనూ మామూలు ఉప్పు బదులు black salt వేసుకోవచ్చు.
*మెంతి మజ్జిగ:
ఈ రెసిపి అదివరకు చెప్పాను. వేసవిలో తరచూ మెంతి మజ్జిగ చేసుకుని సాయంత్రాలు లేదా భోజనాల వేళ సూప్ తాగినట్లు తాగచ్చు.
http://ruchi-thetemptation.blogspot.in/2012/11/blog-post_6.html
కీరా దోసతో:
కీరా దోస(bush cucumber) చాలా చలవ చేస్తుంది. వట్టిగా తినటమే కాక చిన్న చిన్న ముక్కలు చేసి మజ్జిగతో కలిపి(200ml మజ్జిగ + ఒక మీడియం కీరా, black salt) గ్రైండ్ చేసుకుని వడబోసుకుని తాగచ్చు.
Post a Comment