చిరుధాన్యాలన్నింటిలో రాగుల్లో కేల్షియం ఎక్కువ ఉంటుంది. ఏదో ఓ రూపంలో రాగుల్ని నెలకి మూడు సర్వింగ్స్ అయినా ఇస్తే చాలుట పిల్లలకి అసలు ఏ కేల్షియం టాబ్లెట్లూ వాళ్లకి ఇవ్వక్కర్లేదుట. మొన్న 'మిల్లెట్ ఫెస్ట్' లో చెప్పారు. మొలకెత్తించిన రాగుల పిండి అమ్మారు వాళ్ళు. బజార్లో దొరికే మామూలు రాగిపిండి కన్నా ఇలా మొలకలు వచ్చాకా చేసిన రాగిపిండి ఇంకా బలకరం. ఇలాంటిది కూడా "మన్నా" కంపెనీ వాళ్ళు అనుకుంటా అమ్ముతున్నారు.
రాగులు |
నేను బజార్లో కొన్న రాగిపిండి ఫుల్కాల్లోకీ, అట్లలోకీ, పాపకి పూరీల్లోకీ, పకోడీల్లోకీ వాడుతుంటాను. రాగులతో చేసే పదార్థాలను గురించి ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు చోడిజావ గురించి చెప్తాను.. రాగులను "చోళ్ళు" అని కూడా అంటారు. మా ఇంట్లో చోళ్ళనేవారు. వాటితో చిన్నప్పుడు మా తాతమ్మగారు "చోడి జావ" అని పెట్టేవారు. చోళ్ళను నీళ్లలో వేసి మరుగించి, ఆ జావ వడబోసి లేదా చోళ్లతో పాటే గ్రైండ్ చేసుకుని తాగేవారు మా తాతమ్మగారు. మాకేమో ఆ జావలో ఉప్పు వేసి, మజ్జిగ కలిపి ఇచ్చేవారు. వేసవికాలమంతా పొద్దుట టిఫిన్ మానేసి ఆవిడ ఈ చోడిజావే తాగేవారు. మేమూ ఇప్పుడు ఎండలు ఎక్కువయ్యాకా రోజూ రాగి మజ్జిగ తాగుతున్నాం.
* ఇది కాల్షియం నివ్వటమే కాక, శరీరాన్ని చల్లబరుస్తుంది కూడా.
* బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించగలదు.
* కాన్స్టిపేషన్ సమస్యను తగ్గించగలదు.
* రాగుల్లో కేల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్ని స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ వాడకపోవటం మంచిది. డాక్టర్ ని అడిగి తీసుకుంటే మంచిది.
రాగి/చోడి జావ:
* ముందుగా రెండు గ్లాసుల నీటిని(nearly 300ml) మరిగించాలి.
* విడిగా ఒక అరగ్లాసు చల్లని నీళ్లలో రెండు చెంచాల రాగిపిండి బాగా కలిపి, మరుగుతున్న నీటిలో వేసి గరిటెతో అడుగంటకుండా, ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.
* మిశ్రమం దగ్గరపడి, కాస్త జారుగా అయ్యేదాకా ఉంచి స్టౌ ఆపేయాలి. క్రింద ఫోటొలోలాగ.
* జావ చల్లారాకా, సగం గ్లాసు జావకి, సగం పాలు,పంచాదార కలుపుకుని తాగచ్చు.
రాగి మజ్జిగ:
* జావ చల్లారాకా, సగం గ్లాసు జావకి, సగం గ్లాసు చిలికిన పల్చటి మజ్జిగ ఉప్పు వేసుకుని తాగవచ్చు.
*పొద్దున్నే చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని రోజంతా రెండుమూడుసార్లు కూడా తాగచ్చు.
* తాగటానికి అరగంట ముందు బయటకు తీసిపెట్టుకుంటే మంచిది.
* కమ్మని మజ్జిగతో చేస్తే, బాటిల్లో పోసి పిల్లలకి స్కూల్ కి కూడా ఇవ్వవచ్చు.
memu chollane anamu .summarlo memuu baagaane vaadatamu.kaanii maa pillalu anta ishta padaru.manna vaallavi mixed grains powder kuda baguntundi. maa naannagaariki ade vaadataamu.
వేసవి పానీయాలు బాగున్నాయి తృష్ణ గారు.
నాదో చిన్న కోరిక. Pancake ఎలా చేయాలో చెప్తారా. మావాడికి కావాలట. నాకేమో రాదు. ఏం లేదు మమ్మీ దోసల flour తోటే చేసేయి. పైన హనీ వేయాలి అంటాడు:) నాకోసం చెప్తారా!
ఈ బ్లాగ్ లో పోస్ట్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి?
@radhika(nani):thanks radhika gaaru.
@jaya gaaru:ఈ సిరీస్ అవ్వగానే తప్పకుండా రాస్తానండి. టపా తైటిల్ మీద క్లిక్ చేస్తే పెద్దదవుతుందండి.
thanks for the visit..:)