skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

పండుమిరమకాయ - చింతకాయ పచ్చడి

9:08 PM | Publish by తృష్ణ

బజార్లో ఎక్కడ చూసినా పండుమిరపకాయలే ! ఎర్రగా భలే ఉన్నాయి చూట్టానికి. పండు మిర్చి కారం తింటే మాత్రం గూబ గుయ్యే !! అది క్రితం ఏడాది పెట్టాను. ఈసారి పండుమిర్చి, చింతకాయలు కలిపి పచ్చడి చేద్దామని ట్రై చేసాను. బాగానే వచ్చింది. కావాల్సినవి: పండుమిర్చి 200gms చింతకాయలు 300gms (క్వాంటిటి ఇలా అయితే బాగా కారం లేకుండా ఉంటుంది పచ్చడి) ఉప్పు తగినంత (పచ్చడిలో ఎవరెంత వేసకుంటే అంత) పోపుకి: మూడు పెద్ద చెంచాల నూనెలో ఆవాలు, మినపప్పు , 1/2sp ఇంగువ, 1/2sp పసుపు. చేయటం: * పండుమిరపకాయలు కడిగి ఆరబెట్టి, తడిలేకుండా ఆరాకా గ్రైండ్ చేసుకోవాలి. *...

Labels: chutneys n పచ్చడ్స్ 6 comments

ఓట్స్ దోశ

5:09 PM | Publish by తృష్ణ

ఓట్స్ ఉపయోగాలూ, ఉప్మా గురించి(వ్యాఖ్యల్లో) గతంలో రాసాను.  ఇప్పుడు ఓట్స్ దోశ గురించి చెప్పుకుందాం.. కావాల్సినవి: ఒక గ్లాస్ ఓట్స్ ఒక గ్లాస్ దంపుడు బియ్యం లేదా white rice ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం (par boiled rice) అర గ్లాసు అటుకులు అర గ్లాసు మినపప్పు చెయ్యటం: * పైనవన్ని కలిపి మూడు గంటలు నానబెట్టుకున్నాకా, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. * రుబ్బిన పిండి మరో మూడు నాలుగు గంటలు అట్టేబెట్టాలి. లేదా రాత్రికి రుబ్బేసి పొద్దుటిదాకా బయట ఉంచేసి తర్వాత కూడా వేసుకోవచ్చు. అప్పుడు స్పాంజ్ దోశల్లాగ దోశలు ఉబ్బుతాయి....

Labels: tiffins, దోశలు రకాలు 0 comments

(కాల్చిన)అరటికాయ పొడి కూర

11:33 AM | Publish by తృష్ణ

మరుగున పడిపోతున్న మంచి మంచి ఆంధ్రా వంటకాల్లో ఒకటి ఈ అరటికాయ పొడి కూర. వంకాయను కాల్చి పచ్చడి చేసినట్లు అరటికాయను కూడా కాల్చి ఈ కూర చేస్తారు. ఓపిక ఉంటే అరటికాయను కుంపటిలో కాల్చవచ్చు లేదా స్టౌ మీద కూడా కాల్చవచ్చు. ఎలా చెయ్యాలంటే: * ముందుగా పచ్చి అరటికాయకు కాస్త నూనె రాసి పొయ్యి మీద పెట్టాలి. అన్నివైపులా అరటికాయ బాగా కాలేలా కాల్చాలి. (ముచిక బాగ కాలి రాలిపోతే అతఇకాయ బాగా కాలినట్లు.) క్రింద ఫోటోలోలాగ. * తర్వాత తొక్కలోపలి అరటికాయకి మసి అంటకుండా జాగ్రత్తగా తొక్కవలవాలి. వలిచిన అరటికాయ లోపల ఇలా ఉంటుంది.. * కాల్చిన అరటికాయ...

Labels: కూరలు 2 comments

ఆయిల్ ఫ్రీ పొంగడాలు

3:08 PM | Publish by తృష్ణ

వెయిట్ కాన్షియస్నెస్ కీ, ఆయిల్ ఫ్రీ డైట్ కీ ప్రాముఖ్యత పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నూనె లేకుండా తినగలిగే స్నాక్స్ లో ఈ ఆయిల్ ఫ్రీ పొంగడాలు ఒకటి. చేసుకోవటం కూడా సులువు. ఇవి చేసుకోవటానికి షాపుల్లో ఇడ్లీ ప్లేట్ మాదిరిగా గుంటలు ఉండే నాన్స్టిక్ కడాయీ అమ్ముతారు. వీటి తయారీకి ఫ్రెష్ గా రుబ్బుకున్న దోశ పిండిని వాడుకోవచ్చు. అప్పుడే రుబ్బిన పిండి కన్నా పిండి చివరికి వచ్చేసాకా కాస్త పుల్లబడుతుంది కదా అప్పుడు చేసుకున్నా రుచి బాగుంటుంది. దోశ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తురుము కలుపుకోవాలి. కేరెట్ ఇష్టముంటే తురుముకుని...

Labels: snacks n sweets 4 comments

దబ్బకాయ ఊరగాయ

2:31 PM | Publish by తృష్ణ

దబ్బకాయ !! పేరులోనే గొప్ప ఫీల్ ఉంది కదా. మంచి పసుపు రంగులో చూడముచ్చటగా ఉంటుంది దబ్బకాయ. అందుకే మనుషుల రంగును చెప్పేప్పుడు "పచ్చగా దబ్బపండు ఛాయలో.." అని అంటూంటారు. దబ్బకాయతో పప్పు, పులిహోర, ఊరగాయ మొదలైనవి చేసుకుంటారు. అన్నీ బాగుంటాయి. జ్వరం వచ్చి తగ్గాకా ఆ చప్ప నోటికి అంత దబ్బకాయ అన్నం రుచి చూపిస్తే...లాలాజలం ఊరుతుంది. దబ్బ ఆకులు వేసవికాలం మజ్జిగలో వేసుకుని తాగితే ఆ మజ్జిగ రుచి అద్భుతం. మా కాకినాడ ఇంట్లో పనసచెట్టు తో పాటూ దబ్బచెట్టు కూడా ఉండేది. బోలెడు కాయలు కాసేది. పనసకాయలతో పాటూ దబ్బకాయలు, దబ్బ ఆకులు కూడా మాతో విజయవాడ...

Labels: ఊరగాయలు-రకాలు 8 comments

mixed vegetable "కూటు"

1:18 PM | Publish by తృష్ణ

నాకు తెలిసీ "కూటు" అన్ని కూరలు కలిపి చేసుకోవచ్చు, లేక విడివిడిగా ఆనపకాయ, కేరెట్, గుమ్మడికాయ, కేబ్యేజ్ తో, బీట్ రూట్ తో, చౌ చౌ తో, బీన్స్ మొదలైన కూరలతో కూడా చేసుకోవచ్చు. రెండు మూడు రకాలుగా దీన్ని వండుకుంటారు. * కొందరు శనగపప్పు, మినప్పప్పు, కొబ్బరి,ధనియాలు, మిరియాలు కలిపి వేయించి పొడి చేసి ఉడికిన కూరముక్కలు , పప్పు కలిపి చేస్తారు. * కొందరు ఈ పొడి లోనే ఒక కొబ్బరి చిప్ప మొత్తం గ్రైండ్ చేసి పప్పు లేకుండా ఒట్టి కూరముక్కల్లో కలిపి వండుతారు. * కొందరు కూరముక్కలు లేకుండా ఈ పొడిని ఒక్క పప్పులోనే కలిపి వండుతారు. నేను నేర్చుకున్న mixed...

Labels: కూరలు, పప్పులు 2 comments

బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...

2:56 PM | Publish by తృష్ణ

వంకాయతో ఏమాత్రం పోలిక లేని ఈ కూరను "బెంగుళూరు వంకాయ" అని ఎందుకు అంటారో అర్ధం కాదు...:( ఇది బెంగుళూరులో ఎక్కువగా దొరుకుతుందో ఏమో మరి. నార్త్ లో దీన్ని చౌ చౌ(chow chow) అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో chayote అంటారు. చలికాలంలో ఎక్కువగా మార్కెట్లోకి వస్తాయి ఇవి. ఇక ఈ కూరతో అమ్మ "కూటు" మాత్రమే చేసేది. ఇదీ కర్ణాటక వంటకమే . చౌ చౌ మార్కెట్లో కొనేప్పుడు లేతవి చూసి కొనుక్కోవాలి. ముదిరిపోతే పీచు వచ్చేసి రుచి బాగుండదు. ఇంట్లో బహుకొద్ది కూరలు తినేవాళ్ళతో ఈ వంటకం తినిపించటానికి నేను ఈ కూరతో కొన్ని ప్రయోగాలు చేసాను. అదృష్టం బాగుండి ఈ...

Labels: కూరలు 13 comments

పనసపొట్టు ఆవకూర

1:33 PM | Publish by తృష్ణ

మా కాకినాడ ఇంట్లో పేద్ద పనసచెట్టు ఉండేది. నిండా కాయలు, పిందెలతో చెట్టు కళకళాలాడుతూ ఉండేది. కాయ పండితే వంద తక్కువకాకుండా పనసతొనలు వచ్చేవి. అంత పెద్ద పెద్ద కాయలు కాసేది చెట్టు. విచిత్రం ఏంటంటే నాకు పనసతొనలు నచ్చేవి కాదు. వాటి వాసన కూడా గిట్టదు ఇప్పటికీ. కానీ పనసపొట్టు కూర మాత్రం తినేదాన్ని. మేం కాకినాడ నుండి విజయవాడ వచ్చేప్పుడల్లా చిన్న చిన్న కాయలు ఐదారు ఓ సంచీతో ఇచ్చేది మా నాన్నమ్మ. సామానుతో పాటూ ఈ సంచీ కూడా విజయవాడ వచ్చాకా కొందరికి మొత్తం కాయ, కొందరికి కొట్టిన పనసపొట్టూ పంచేవాళ్ళం. ఇప్పుడు బజార్లో పనసపొట్టు కొన్నప్పుడల్లా...

Labels: కూరలు 7 comments

అరటిపువ్వు పచ్చడి

11:30 AM | Publish by తృష్ణ

అరటిపువ్వులో vitamin E పుష్కలంగా ఉంటుంది. చాలా మంచిది. అరటిపువ్వు ముఫ్ఫై రోజులు వరుసగా వాడితే బ్లడ్ సుగర్ లెవెల్స్ తగ్గుతాయని క్రింద వెబ్సైట్ లో రాసాడు....వాడకం వల్ల శరీరానికి చేకూరే మరిన్ని లాభాల గురించీ ఇక్కడ చూడండి. ఇదివరకూ అరటిపువ్వు వడలు గురించి రాసాను. ఇప్పుడు పచ్చడి చేస్కుందాo.. ముందుగా ఒక అరటిపువ్వు తీసుకుని, చేతికి కాస్త నూనె రాసుకుని(లేకపోతే వేళ్ళు నల్లగా అయిపోతాయి) ఆ పువ్వులో చివర ఉన్నవి వలుచుకోవాలి. ఆ తరువాత వాటిల్లోంచి క్రింద ఫోటోలో చూపించినవి తొలగించవలెను. లేకపోతే చేదు,వగరు కలగలిపి ఒక వింత టేస్టు వస్తుంది....

Labels: chutneys n పచ్చడ్స్ 3 comments

వాక్కాయ-కొబ్బరికాయ పచ్చడి

5:34 PM | Publish by తృష్ణ

మార్కెట్లోకి వక్కాయలు వచ్చాయి.. మరి పచ్చడి చేసేస్కుందామా? వాక్కాయలు మరీ పండిపోకుండా గ్రీన్ గా ఉన్నవి కొనుక్కోవాలి.. ఇలా.. వాటి మధ్యన గింజలు తీసేయాలి క్రింద ఫోటోలోలాగ. లేకపోతే పచ్చడి చేదొస్తుంది. కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలానే అన్ని పాళ్ళు తీసుకుని, చింతపండు బదులుగా ఈ వాక్కయల్ని వాడాలి. అంతే.  కొలతలు కావలంటే: * మొదట ఆవలు, మినపప్పు (కాస్త ఎక్కువ), కాస్త జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కాస్త ఇంగువ, ఓ రొబ్బ కర్వేపాకు లతో పోపు పెట్టుకోవాలి. తర్వాత: * ఒక కొబ్బరి చిప్ప (మొత్తం కాదు సగమే..:)) చిన్నగా ముక్కలు...

Labels: chutneys n పచ్చడ్స్ 6 comments

కేబేజీ పకోడి

11:39 AM | Publish by తృష్ణ

ఎలాగంటే: * కేబేజీ సన్నగా తరుక్కోవాలి. * చిన్న అల్లం ముక్క తురుముకోవాలి. * ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కోవాలి. * ఇవన్నీ కలిపి, ఉప్పు, కారం వేసి ఉల్లిపాయపకోడి కి కలుపుకున్నట్లే శనగపిండి, దాంట్లో పావు వంతు బియ్యప్పిండి వేసి గట్టిగా పిండి కలుపుకోవాలి. * కొలత కావాలంటే పావుకేజీ కేబేజీ తరుగుకి, సుమారు 60gms శనగపిండి, 15gms బియ్యప్పిండి కలపాలన్నమాట. *మూకుడులో నూనె కాగాకా పకోడీలు వేయించుకోవటమే. ::::::::::  ******   :::::::::::   ****** మొన్న నా బజ్ లో నేను షేర్ చేసుకున్న మిరపకాయ...

Labels: snacks n sweets 3 comments

కొబ్బరన్నం with & without masala

7:17 PM | Publish by తృష్ణ

మసాలా లేకుండా: * ముందుగా ఒక గ్లాస్(nearly 150gms rice) అన్నం వండేసుకోవాలి. * మూడు చెంచాల నూనె/నెయ్యిలో క్రింద ఐటెమ్స్ తో పోపు పెట్టుకోవాలి: శనగపప్పు రెండు చెంచాలు, మినపప్పు రెండు చెంచాలు, ఆవాలు ఒక చెంచా, జీలకర్ర ఒక చెంచా, ఇంగువ పావు చెంచా, కర్వేపాకు రెండు రొబ్బలు, మూడు ఎండు మిరపకాయలు,రెండు పచ్చిమిరపకాయలు. * బఠాణీ ఇష్టమైతే గుప్పెడు నానబెట్టుకుని ఉడికించుకోవాలి విడిగా * చివరిగా ఒక చిప్ప తురిమిన కొబ్బరికోరు వేసి స్టౌ ఆపేయాలి. * విడిగా పెట్టుకున్న అన్నంలో పైన వేయించిన పోపు వేసేసుకుని, బఠాణీ , తగినంత ఉప్పువేసి బాగా...

Labels: రైస్ వెరైటీస్ 3 comments

Russian salad

7:54 PM | Publish by తృష్ణ

నాకు బాగా ఇష్టమైన, నేను తరచూ చేసే సలాడ్ ఇది. కాకపోతే రకరకాల హోటల్స్ లో రకరకాల పదార్ధాలతో చేస్తారు. అంటే కొందరు పొటాటో, కేప్సికం కూడా వేస్తారు. కొందరు అవి వెయ్యరు. నేను ఎలా చేస్తానంటే: * పైనాపిల్ ముక్కలు, కేరెట్ , బఠాణీ, బీన్స్ ముక్కలు వాడతాను. బఠాణీ ఫ్రెష్ వి దొరకని సీజన్లో నానబెట్టి, విడిగా ఉడకబెట్టి కలుపుతాను. కూరముక్కల కన్నా ఎక్కువ టైమ్ తీశుకుంటాయి కదా ఉడకటానికి అందుకు. * కేరెట్ , బీన్స్ రెండూ కొంచెం ఉడకబెట్టిన ముక్కలు. పూర్తిగా మెత్తగా అవ్వకుండా కాస్త మెత్తబడితే చాలు. (half-boiled అన్నమాట) * ఈ ముక్కలు...

Labels: salads 2 comments

బీట్రూట్ - ఆవ కూర

3:39 PM | Publish by తృష్ణ

బీట్రూట్ తో వండుకునే కూఅల్లో ఇదీ ఒక రకం. కావాల్సినవి: బీట్రూట్ - రెండు పెద్దవి పోపుకు : ఆవాలు,శనగపప్పు,మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, కర్వేపాకు అర చెంచా పచ్చి ఆవపొడి పోపుకి తగినంత నూనె తయారీ: * బీట్రూట్ ముక్కలు చిన్నగా తరిగి, ముక్కలు ఎంత క్వాంటిటి ఉన్నాయో వాటికి సగం వంతు నీళ్ళు పోసి, తగినంత ఉప్పు కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. (కుక్కర్లో ఉడకపెట్టే ఏ ముక్కలకయినా ఇలానే నీళ్ళు పోస్తే, నీళ్ళు వేస్ట్ అవ్వవు. వాటిలోని పోషకాలు కూడా పోకుండా ఉంటాయి.) * మూకుడులో పోపు వేసుకుని ఉడికిన ముక్కలు అందులో వెయ్యాలి....

Labels: కూరలు 7 comments

మిక్స్డ్ వెజిటెబుల్ ఆవకాయ

7:20 PM | Publish by తృష్ణ

మావిడికాయతో పెట్టుకునే పర్మెనెన్ట్ ఆవకాయ కాకుండా టెంపరరీగా కేరెట్, కాకరకాయ, ములక్కడ, పచ్చిమెరప, కాలీప్లవర్, టమాటా మొదలైన కూరలతో కూడా టెంపరరీ ఆవకాయ పెట్టుకుంటాం కదా. అలానే కొన్ని కూరలు కలిపి కూడా మిక్స్డ్ వెజ్ ఆవకాయ పెట్టుకోవచ్చు. ఎలాగో చూసేస్తారా మరి.. కావాల్సిన కూరలు, పదార్ధాలు: * కాలీప్లవర్ * బీన్స్ * కేరెట్ * బంగాళా దుంప(పచ్చిదే) * బఠాణీ(నానబెట్టినవి) * టమాటా (కొంచెం గట్టిగా ఉన్నది చిన్న ముక్కలు తరుక్కోవాలి) పైన రాసిన కూరలన్నీ ఓ 250gms దాకా ఉండేలా చిన్నముక్కలు తరుగుకోవాలి. (అన్నీ పచ్చివే.)* 1 inch కట్ చేసిన వెల్లుల్లి...

Labels: ఊరగాయలు-రకాలు 2 comments

పచ్చి టమాటా తో ' మెంతిబద్దలు '

2:36 PM | Publish by తృష్ణ

పచ్చి టమాటాలతో పప్పు, పచ్చడి చాలా బావుంటాయి. పచ్చి టమాటాలతో చేసే 'మెంతి బద్దలు ' ఇంకా బావుంటాయి. అన్నం లోకీ, చపాతీల్లోకీ కూడా బావుంటాయి. పచ్చి టమాటా తో మెంతిబద్దలకి కావాల్సినవి: ఆకుపచ్చని పచ్చి టమాటాలు - 3 మెంతులు - నాలుగు స్పూన్లు ఆవాలు - మూడు స్పూన్లు మినపప్పు - ఒక స్పూన్ ఎండు మిరపకాయలు - నాలుగైదు రెండు చెంచాల నూనె చిటికెడు ఇంగువ అర చెక్క నిమ్మరసం తయారీ: * ముందుగా అర చెంచా నునెలో మెంతులు, ఆవాలు,మినప్పప్పు బాగా వేగనిచ్చి తరువాత ఎండు మిర్చి కూడా వేసి, అన్నీ వేగాకా స్టౌ ఆపే ముందర కాస్తంత ఇంగువ వేయాలి. * పైన వేయించిన...

Labels: chutneys n పచ్చడ్స్ 15 comments

ములక్కాడ(drumstick) తియ్య కూర

12:43 PM | Publish by తృష్ణ

కావాల్సినవి: * రెండు పెద్ద ములక్కాడలు * అర చిప్ప కోరిన కొబ్బరి * నాలుగు పెద్ద చెంచాలు నానబెట్టిన బియ్యం * సుమారు 50gms బెల్లం లేక పంచదార (తీపి ఇష్టమున్నవారు మరికాస్త ఎక్కువ తీపి వేసుకోవచ్చు) * పోపు కు : ఆవాలు, జీలకర్ర, మినపప్పు, రెండు ఎండు మిరపకాయలు. * రుచికి సరిపడా ఉప్పు. తయారీ: * రెండు గంటల ముందుగా బియ్యం నానబెట్టి, కూర వండే ముందు తురిమిన పచ్చి కొబ్బరి వేసి మెత్తగా, జారుగా గ్రైండ్ చేసుకోవాలి. * ములక్కాడ ముక్కలు రెండంగుళాలు చప్పున ముక్కలు తరుక్కుని, చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో పెడితే ఒక్క స్టీం...

Labels: కూరలు 6 comments
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ▼  2011 (35)
    • ▼  December (3)
      • పండుమిరమకాయ - చింతకాయ పచ్చడి
      • ఓట్స్ దోశ
      • (కాల్చిన)అరటికాయ పొడి కూర
    • ►  November (6)
      • ఆయిల్ ఫ్రీ పొంగడాలు
      • దబ్బకాయ ఊరగాయ
      • mixed vegetable "కూటు"
      • బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...
      • పనసపొట్టు ఆవకూర
      • అరటిపువ్వు పచ్చడి
    • ►  September (3)
      • వాక్కాయ-కొబ్బరికాయ పచ్చడి
      • కేబేజీ పకోడి
      • కొబ్బరన్నం with & without masala
    • ►  August (4)
      • Russian salad
      • బీట్రూట్ - ఆవ కూర
      • మిక్స్డ్ వెజిటెబుల్ ఆవకాయ
      • పచ్చి టమాటా తో ' మెంతిబద్దలు '
    • ►  June (2)
      • ములక్కాడ(drumstick) తియ్య కూర
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    2 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.